కనుగొనేందుకు ఏఎస్ఐ సిద్ధం
పూరీ శ్రీక్షేత్రం
గోపాలపూర్, న్యూస్టుడే: పూరీ జగన్నాథుని రత్నభాండాగారం రహస్యగదుల దిగువ సొరంగ మార్గం ఉందా? అక్కడ మరిన్ని గదులున్నాయా?
ఉంటే వాటిలో స్వామికి సంబంధించి విలువైన సంపద ఉందా? ఇదిప్పుడు చర్చనీయాంశమైంది. శ్రీక్షేత్ర యంత్రాంగం ప్రభుత్వ ఉత్తర్వుల మేరకు రత్న భాండాగారం తెరిపించింది. గదుల్లోని సంపద తాత్కాలిక స్ట్రాంగ్ రూంకు తరలించింది. సొరంగ మార్గం కనుగొనే బాధ్యత ఏఎస్ఐకు అప్పగించింది. హైదరాబాద్కు చెందిన ఎన్జీఆర్ఐ నిపుణుల సాయం తీసుకోనున్నారు.
మూడురోజుల పరిశీలన
సొరంగ మార్గం అన్వేషణ ఆషామాషీకాదు. రాడార్, ఇతర అత్యాధునిక యంత్రాలతో శోధన చేపట్టాల్సి ఉందని రత్నభాండాగారం అధ్యయన సంఘం అధ్యక్షుడు జస్టిస్ బిశ్వనాథ్ రథ్ తెలిపారు. దీంతో సొరంగం తెలుసుకునేందుకు 21 నుంచి 23 వరకు పరిశీలన జరగనుంది. మధ్యాహ్నం 2 నుంచి సాయంత్రం 6 వరకు పనులు జరుగుతాయి. శనివారం నుంచి సోమవారం వరకు మధ్యాహ్నం ఒంటిగంట నుంచి సాయంత్రం 6 గంటల వరకు భక్తుల దర్శనాలు నిలిపివేయనున్నారు.