కర్ణాటక వైల్డ్ లైఫ్ ఆధారంగా నిర్మాణం
నవంబర్ 07 (ఆంధ్రపత్రిక): కన్నడ పవర్ స్టార్‌గా అభిమానుల గుండెల్లో స్థానం సంపాదించుకున్నారు నటుడు పునీత్ రాజ్ కుమార్ 46 సంవత్సరాల వయస్సులో గతేడాది అక్టోబర్ 29న గుండెపోటుతో ఆయన మరణించారు. పునీత్ హఠాన్మరణం కేవలం కన్నడ ఫిల్మ్ ఇండస్ట్రీనేకాదు, యావత్తు భారతీయ సినీ ప్రపంచమే ఉలిక్కిపడేలా చేసింది. ఇక పునీత్ నటించిన ఆఖరి చిత్రం గంధద గుడి. కర్ణాటక వైల్డ్ లైఫ్ ఆధారంగా చేసుకొని ఓ డాక్యుమెంటరీ డ్రామాగా దీన్ని రూపొందించారు. పునీత్ రాజ్ కుమార్ మొదటి వర్ధంతికి ఒక రోజు ముందు 28 అక్టోబర్ 2022న ప్రేక్షకుల ముందుకొచ్చిన ఈ చిత్రం.. ఎందరో ప్రముఖుల ప్రశంసలు అందుకుంటోంది. ఈ నేపథ్యంలో ఈ సినిమాను ఉద్దేశిస్తూ తాజాగా పునీత్ భార్య అశ్విని కర్ణాటక ప్రజలకు భావోద్వేగంతో కూడిన లేఖ రాశారు. ’గంధద గుడి అప్పూ కలల చిత్రం. కర్ణాటక అడవుల అందాలను కన్నడ ప్రజలకు చూపించాలని ఆయన ఈ సినిమా చేశారు. కన్నడ ప్రజలందరూ ఈ సినిమా చూడాలన్నది ఆయన కోరిక. ముఖ్యంగా పిల్లలు. మన పిల్లల కోసం అడవులను కాపాడుకుందాం. వాళ్లకి కర్ణాటక అందాలు చూపిద్దాం’ అని లేఖలో పేర్కొన్నారు. ఈ సందర్భంగా అభిమానులకు అశ్విని ఓ సప్రైజ్ ఇచ్చారు. ఈ చిత్రాన్ని కన్నడ ప్రజలందరూ తప్పకుండా చూడాలన్న అప్పూ కోరిక మేరకు.. ’గంధద గుడి’ చిత్రం కర్ణాటక వ్యాప్తంగా సింగిల్ స్క్రీన్‌లో రూ.56కి, మల్టీప్లెక్స్‌లో రూ.112కే అందుబాటులోకి తెస్తున్నట్లు ప్రకటించారు. సోమవారం నుంచి గురువారం వరకు కర్ణాటకలోని అన్ని థియేటర్లలో ఈ చిత్రం ప్రదర్శితమవుతుందని తెలిపారు. ఈ సినిమాను తన సొంత నిర్మాణ సంస్థ ఖఖీఐ ప్రొడక్షన్స్‌లో పునీత్ భార్య అశ్విని నిర్మించారు. వైల్ట్‌లైఫ్ ఫొటోగ్రాఫర్ అమోఘ వర్ష ఈ సినిమాను తెరకెక్కించారు. అంతే కాదు పునీత్ రాజ్ కుమార్ తో కలిసి ఈ సినిమాలో నటించాడు ఆయన. అయితే చిత్రీకరణ పైర్‌ఖ్తెన కొన్ని నెలలకే పునీత్ మృతి చెందారు. ఈ నేపథ్యంలో అక్టోబర్ 28న ప్రేక్షకుల ముందుకొచ్చిన ఈ చిత్రం మంచి విజయం సాధించింది.