పూడిమడక వద్ద న్యూ ఎనర్జీ పార్కు ఏర్పాటు
మొత్తంగా రూ.1,10,000 కోట్ల పెట్టుబడి
వైజాగ్ టెక్ పార్కుకు 60 ఎకరాలు కేటాయింపు
వంద మెగావాట్ల డేటా సెంటర్ ఏర్పాటు
నెల్లూరు బ్యారేజీకి నల్లపురెడ్డి శ్రీనివాసులురెడ్డి పేరు
ఏపీ మెడికల్ సర్వీసెస్ రిక్రూట్మెంట్ బోర్టు ఏర్పాటు
తాడేపల్లిగూడెంలో పోలీస్ సబ్ డివిజన్ ఏర్పాటు
ఎపి కేబినేట్లో పలు కీలక నిర్ణయాలకు ఆమోదం
అమరావతి, ఫిబ్రవరి 8 (ఆంధ్రపత్రిక): ఏపీ మంత్రివర్గ సమావేశం కీలక నిర్ణయం తీసుకుంది. సీఎం జగన్ అధ్యక్షతన జరిగిన ఎపి క్యాబినెట్ సమావేశంలో మంత్రివర్గం పలు అంశాలపై చర్చించి, నిర్ణయాలు తీసుకుంది. ఎన్టీపీసీ ఆధ్వర్యంలో అనకాపల్లి జిల్లా పూడిమడక వద్ద న్యూ ఎనర్జీ పార్కు ఏర్పాటుకు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. మొదటి విడతలో రూ.55 వేల కోట్లు, రెండో విడతలో రూ.55వేల కోట్లు పెట్టుబడికి అంగీకారం తెలిపింది. మొత్తంగా రూ.1,10,000 కోట్ల పెట్టుబడిని ప్రభుత్వం పెట్టనుంది. ఫేజ్ వన్‌లో 30 వేల మందికి, ఫేజ్ టూ లో 31వేల మందికి ఉద్యోగాలు కల్పించనున్నారు. మొత్తంగా 61వేల మందికి ఉద్యోగాలు వచ్చే అవకాశం ఉంది. అలాగే కర్నూలు, నంద్యాల, అనంతపురం, సత్యసాయి జిల్లాల్లో విండ్ , సోలార్ పవర్ ప్రాజెక్ట్‌లకు కేబినెట్ ఆమోద ముద్ర వేసింది. 1000 మెగావాట్ల విండ్, 1000 మెగావాట్ల సోలార్ ప్రాజెక్ట్‌లను ఎకోరెన్ ఎనర్జీ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ ఏర్పాటు చేయనుంది. నాలుగు విడతల్లో మొత్తంగా రూ.10,500 కోట్ల పెట్టుబడి పెట్టనుండగా… 2 వేల మందికి ఉద్యోగాలు కల్పించను న్నారు. వైజాగ్ టెక్ పార్కుకు 60 ఎకరాలు కేటాయించడంతో పాటు, వంద మెగావాట్ల డేటా సెంటర్ ఏర్పాటుకు మంత్రివర్గం ఆమోదం తెలిపింది. కొత్త పాలసీలో భాగంగా పంప్డ్ స్టోరేజ్ హైడ్రో ప్రాజెక్టులకు ఆమోదం తెలిపింది. బందరు పోర్టుకు పవర్ ్గªనాన్స్ కార్పోరేషన్ ద్వారా రూ. 3940 కోట్ల రుణం తీసుకునేందుకు మంత్రివర్గం అంగీకారం తెలియజేసింది. 9.75 శాతం వడ్డీతో రూ. 3940 కోట్ల రుణం తీసుకోనుంది. అటు నెల్లూరు బ్యారేజీకి నల్లపురెడ్డి శ్రీనివాసులు రెడ్డి బ్యారేజీగా పేరు మార్చేందుకు కేబినెట్ ఆమోద ముద్ర వేసింది. గ్రానైట్ కంపెనీలకు విద్యుత్ రాయితీలకు అంగీకారం తెలిపిన కేబినెట్… యూనిట్‌కు రూ. 2 చొప్పున వసూలు చేయాలని నిర్ణయించింది. వైద్యారోగ్య శాఖలో రిక్రూట్మెంట్ కోసం ప్రత్యేక వ్యవస్థ ఏర్పాటు చేయాలని కేబినెట్ నిర్ణయం తీసుకుంది. ఏపీ మెడికల్ సర్వీసెస్ రిక్రూట్మెంట్ బోర్టు ఏర్పాటుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. యూనివర్శిటిల్లోని నాన్ టీచింగ్ స్టాఫ్ పదవీ విరమణ వయస్సును 62 ఏళ్లకు పెంచాలని కేబినెట్ నిర్ణయించింది. జే ఎస్ డబ్ల్యూ ఇన్ఫాస్టక్చర్ర్ లిమిటెడ్ సంస్థ కు రామాయపట్నం పోర్టులో రెండు క్యాప్టివ్ బెర్తులను కేటాయించనుంది. నామినేషన్ పద్దతిలో జే ఎస్ డబ్ల్యూకు బెర్తుల కేటాయింపు జరుగనుంది. జే ఎస్ డబ్ల్యూ సంస్థకు 250 ఎకరాల భూమిని మారీటైమ్ బోర్డు ద్వారా కేటాయించేలా కేబినెట్ నిర్ణయం తీసుకుంది. కొన్ని జిల్లాల కేంద్రాలను అర్బన్, రూరల్ మండలాలుగా విభజించేందుకు మంత్రివర్గం ఆమోదముద్ర వేసింది. విజయనగరం, ఏలూరు, మచిలీపట్నం, ఒంగోలు, నంద్యాల, అనంత, చిత్తూరు జిల్లా కేంద్రాలను అర్బన్, రూరల్ మండలాలుగా విభజించాలని నిర్ణయించింది. తాడేపల్లిగూడెంలో పోలీస్ సబ్ డివిజన్ ఏర్పాటుకు కేబినెట్ అంగీకారం తెలిపింది. ఉగాదికి అందించే సంక్షేమ పథకాలకు క్యాబినెట్ ఆమోదం తెలిపింది. ఉగాది సంబరాలు ఘనంగా నిర్వహించాలని నిర్ణయించింది. అజెండాలోని అన్ని అంశాలకు ఆమోదం తెలిపింది.వై ఎస్సార్ లా నేస్తం, వై ఎస్సార్ ఆసరా, ఈ బీసీ నేస్తం, వైఎస్సార్ కల్యాణ మస్తులను మంత్రి వర్గం ఆమోదించింది. జగనన్న విద్యా దీవెన, జగనన్న వసతి దీవెన, రాష్ట్రంలో భారీ పరిశ్రమల ఏర్పాటు ప్రతిపాదనలకు కేబినెట్ ఆమోదం తెలిపింది. స్టేట్ ఇన్వెస్ట్మెంట్ ప్రమోషన్ బోర్డ్ ప్రతిపాదనలకు ఆమోదం లభించింది.ప్రధానంగా 70 అజెండా అంశాలపై క్యాబినెట్ చర్చించనుంది. రాష్ట్రంలో భారీ పరిశ్రమల ఏర్పాటు ప్రతిపాదనలకు క్యాబినెట్ ఆమోదం తెలపనుంది. స్టేట్ ఇన్వెస్ట్మెంట్ బోర్డు ప్రతిపాదనలకు క్యాబినెట్ ఆమోదం తెలిపే అవకాశం ఉంది. సుమారు రూ. లక్షా 45 వేల కోట్ల పెట్టుబడులకు క్యాబినెట్ గ్రీన్ సిగల్ ఇవ్వనుంది.
Trending
- AP TET 2024 Results: మరికాసేపట్లో టెట్ ఫలితాలు వచ్చేస్తున్నాయ్..
- AP Mega DSC Notification: మరో 2 రోజుల్లోనే మెగా డీఎస్సీ నోటిఫికేషన్ వచ్చేస్తోంది.. జిల్లాల వారీ ఖాళీలు ఇవే!
- Tirumala: నాగుల చవితి సందర్భంగా రేపు పెద్ద శేష వాహనం సేవ.. దేవేరులతో కలిసి శ్రీవారు భక్తులకు దర్శనం..
- AP News: ట్రెండింగ్ చేస్తున్నారా? అయితే వీళ్లకు చిక్కితే అంతే సంగతులు..
- Running Train: రన్నింగ్ ట్రైన్ నుంచి కాలువలోకి దూకేసిన మహిళ.. ఆ తర్వాత ఏం జరిగిందంటే?
- సెక్యూరిటీ గార్డు డాక్టర్ అయ్యాడు! ఏకంగా రోగికి కట్టుకట్టి ఇంజెక్షన్ కూడా ఇచ్చాడు!
- చాప్టర్ 3: చెన్నైలో కొడాలి అరెస్ట్.. రజనీ కూతురు బిగ్ స్టెప్..
- Telangana Police: మళ్లీ మొదలైన లోన్ యాప్ ఆగడాలు.. పోలీసుల లేటెస్ట్ అలెర్ట్..!