మండే ఎండల్లో ఊరటనిచ్చే వార్త. ఏపీలోని పలు ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులతో వర్షాలు పడే అవకాశం ఉందని అమరావతి వాతావరణ కేంద్రం తెలిపింది. రాష్ట్రమంతటా తేలికపాటినుండి మోస్తరు వర్షము లేదా ఉరుములతో కూడిన జల్లులు పడతాయని అంచనా వేసింది. లేటెస్ట్ వెదర్ రిపోర్ట్ మీ కోసం….
నైరుతి రుతుపవనాలు ఈశాన్య బంగాళాఖాతంలోని మిగిలిన ప్రాంతాలు, వాయువ్య బంగాళాఖాతంలోని కొన్నిప్రాంతాలలోకి , త్రిపుర, మేఘాలయ, అస్సాంలోని మిగిలిన భాగాలు, పశ్చిమ బెంగాల్ & సిక్కి లోని చాలా భాగాల వరకు విస్తరించాయి. రుతుపవనాలు రానున్న 2-3 రోజుల్లో మధ్య అరేబియా సముద్రంలో మరికొన్ని ప్రాంతాల్లోకి , దక్షిణ అరేబియా సముద్రంలోని మిగిలిన భాగాలు, లక్షద్వీప్ ప్రాంతం, కేరళ , కర్ణాటకలోని కొన్ని భాగాలు, తమిళనాడులోని మరికొన్ని ప్రాంతాలు, నైరుతి బంగాళా ఖాతలోనూ మరింత ముందుకు వెళ్లేందుకు పరిస్థితులు అనుకూలంగా ఉన్నాయి. ఇక ఆంధ్ర ప్రదేశ్, యానంలో దిగువ ట్రోపోఆవరణములో నైరుతి / పశ్చిమ దిశ గా గాలులు వీస్తున్నాయి. ఈ క్రమంలోరాబోవు మూడు రోజులకు వాతావరణ సూచనలు ఎలా ఉన్నాయో ఇప్పుడు తెలుసుకుందాం..
శుక్రవారం, శనివారం :- తేలికపాటినుండి ఒక మోస్తరు వర్షము లేదా ఉరుములతో కూడిన జల్లులు ఒకటి లేదా రెండు చోట్ల కురిసే అవకాశముంది. ఉరుములతో కూడిన మెరుపులు ఒకటి లేదా రెండు చోట్ల సంభవించే అవకాశముంది. బలమైన గాలులు గంటకు 30 – 40 కి మీ వేగం తో వీచే అవకాశం ఉంది. వేడి ,తేమ, అసౌకర్యమైన వాతావరణం ఒకటి లేదా రెండు చోట్ల ఏర్పడే అవకాశముంది.
ఆదివారం :- తేలికపాటినుండి ఒక మోస్తరు వర్షము లేదా ఉరుములతో కూడిన జల్లులు కొన్ని చోట్ల కురిసే అవకాశముంది. భారీ వర్షాలు ఒకటి లేదా రెండు చోట్ల కురిసే అవకాశముంది. ఉరుములతో కూడిన మెరుపులు ఒకటి లేదా రెండు చోట్ల సంభవించే అవకాశముంది. బలమైన గాలులు గంటకు 30 – 40 కి మీ వేగం తో వీచే అవకాశం ఉంది .
దక్షిణ కోస్తా ఆంధ్రప్రదేశ్ :-
శుక్రవారం : తేలికపాటినుండి ఒక మోస్తరు వర్షము లేదా ఉరుములతో కూడిన జల్లులు ఒకటి లేదా రెండు చోట్ల కురిసే అవకాశముంది. ఉరుములతో కూడిన మెరుపులు ఒకటి లేదా రెండు చోట్ల సంభవించే అవకాశముంది. బలమైన గాలులు గంటకు 30 – 40 కి మీ వేగం తో వీచే అవకాశం ఉంది. వడగాలులు ఒకటి లేదా రెండు చోట్ల వీచే అవకాశం ఉంది.
శనివారం :- తేలికపాటినుండి ఒక మోస్తరు వర్షము లేదా ఉరుములతో కూడిన జల్లులు కొన్ని చోట్ల కురిసే అవకాశముంది. ఉరుములతో కూడిన మెరుపులు ఒకటి లేదా రెండు చోట్ల సంభవించే అవకాశముంది. బలమైన గాలులు గంటకు 30 – 40 కి మీ వేగం తో వీచే అవకాశం ఉంది.
రాయలసీమ :-
శుక్రవారం- తేలికపాటినుండి మోస్తరు వర్షము లేదా ఉరుములతో కూడిన జల్లులు ఒకటి లేదా రెండు చోట్ల కురిసే అవకాశముంది. ఉరుములతో కూడిన మెరుపులు ఒకటి లేదా రెండు చోట్ల సంభవించే అవకాశముంది. బలమైన గాలులు గంటకు 30 – 40 కి మీ వేగం తో వీచే అవకాశం ఉంది. వేడి, తేమ అసౌకర్యమైన వాతావరణం ఒకటి లేదా రెండు చోట్ల ఏర్పడే అవకాశముంది.
శనివారం : తేలికపాటినుండి మోస్తరు వర్షము లేదా ఉరుములతో కూడిన జల్లులు కొన్ని చోట్ల కురిసే అవకాశముంది. ఉరుములతో కూడిన మెరుపులు ఒకటి లేదా రెండు చోట్ల సంభవించే అవకాశముంది. బలమైన గాలులు గంటకు 30 – 40 కి మీ వేగం తో వీచే అవకాశం ఉంది. వేడి, తేమ, అసౌకర్యమైన వాతావరణం ఒకటి లేదా రెండు చోట్ల ఏర్పడే అవకాశముంది.
ఆదివారం :- తేలికపాటినుండి ఒక మోస్తరు వర్షము లేదా ఉరుములతో కూడిన జల్లులు అనేక చోట్ల కురిసే అవకాశముంది. భారీ వర్షాలు ఒకటి లేదా రెండు చోట్ల కురిసే అవకాశముంది. ఉరుములతో కూడిన మెరుపులు ఒకటి లేదా రెండు చోట్ల సంభవించే అవకాశముంది. బలమైన గాలులు గంటకు 30 – 40 కి మీ వేగం తో వీచే అవకాశం ఉంది.