ఏపీవాసులకు కూల్ న్యూస్ అందించింది వాతావరణ శాఖ. వచ్చే 4 రోజుల్లో రాష్ట్రంలోని పలు జిల్లాల్లో అక్కడక్కడా వర్షాలు కురుస్తాయని పేర్కొంది. ఈ క్రమంలోనే రాష్ట్రంలో ఐదారు రోజులుగా 42-46 డిగ్రీల మధ్య నమోదవుతున్న ఉష్ణోగ్రతలు సోమవారం కాస్త ఉపశమనాన్ని కల్పించాయి.
ఏపీవాసులకు కూల్ న్యూస్ అందించింది వాతావరణ శాఖ. వచ్చే 4 రోజుల్లో రాష్ట్రంలోని పలు జిల్లాల్లో అక్కడక్కడా వర్షాలు కురుస్తాయని పేర్కొంది. ఈ క్రమంలోనే రాష్ట్రంలో ఐదారు రోజులుగా 42-46 డిగ్రీల మధ్య నమోదవుతున్న ఉష్ణోగ్రతలు సోమవారం కాస్త ఉపశమనాన్ని కల్పించాయి. శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం, మన్యం, వైజాగ్, అల్లూరి జిల్లాల్లో వచ్చే 4 రోజులు.. అలాగే ఈ నెల 11, 12 తేదీల్లో తూర్పుగోదావరి, ఎన్టీఆర్, కృష్ణా, బాపట్ల, కర్నూలు, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. ఇటు ఆంధ్రప్రదేశ్, అటు తెలంగాణలోని అన్ని జిల్లాల్లో మంగళవారం నుంచి ఉష్ణోగ్రతలు 40 డిగ్రీల కంటే తక్కువ నమోదు కావచ్చునని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు.
అటు నంద్యాల గోస్పాడులో అత్యధికంగా 44.4 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదైనట్టు తెలుస్తోంది. అయితే రాయలసీమ ప్రాంతాల్లో ఇంకా వడగాల్పులు వీస్తుండగా.. మంగళవారం నాటికి అక్కడ కూడా ఉష్ణోగ్రతలు తగ్గే అవకాశం ఉందట. వచ్చే 5 రోజుల్లో రెండు తెలుగు రాష్ట్రాల్లో వడగాల్పుల నుంచి ప్రజలకు కొంత మేర ఉపశమనం కలగవచ్చునని వాతావరణ శాఖ అంచనా వేస్తోంది.
ఏది ఏమైనా ప్రజలు వీలైనంతవరకు ఎండ సమయంలో ఇంట్లోనే ఉండాలని.. వృద్దులు, గర్భిణీలు, బాలింతలు తగిన జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. డీహైడ్రేట్ కాకుండా ఉండటానికి ఓఆర్ఎస్(ఓరల్ రీహైడ్రేషన్ సొల్యూషన్), ఇంట్లో తయారుచేసిన పానీయాలైన లస్సీ, నిమ్మకాయ నీరు, మజ్జిగ, కొబ్బరి నీరు మొదలైనవి తాగాలని సూచిస్తున్నారు.