ఢిల్లీ పర్యటనలో ఉన్న ఏపీ బీజేపీ అధ్యక్షురాలు పురంధేశ్వరి కేంద్ర హోం మంత్రి అమిత్‌షాతో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా రాష్ట్రానికి సంబంధించిన పలు అంశాలను హోం మంత్రి దృష్టికి తెచ్చారు. ఏపీలో గత నాలుగున్నరేళ్లలో మద్యం విధానంలో జరిగిన అవకతవకలపై సీబీఐతో విచారణ జరిపించాలని ఈ సందర్భంగా అమిత్‌షాకు విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు మద్యం కొనుగోళ్లు, అమ్మకాలకు సంబంధించిన విషయాలపై వినతిపత్రం..
ఏపీలో మద్యం విధానంపై పోరాటం ఉధృతం చేసింది బీజేపీ. మద్యం కొనుగోళ్లు, అమ్మకాల్లో భారీగా అక్రమాలు జరుగుతున్నాయని ఆరోపిస్తున్న ఆ పార్టీ నేతలు విషయాన్ని కేంద్రం దృష్టికి తీసుకువెళ్లారు. ప్రస్తుతం ఢిల్లీలో పర్యటిస్తున్న పురంధేశ్వరి.. అమిత్‌షాను కలిసి దీనిపై ఫిర్యాదు చేశారు. మరోవైపు పార్టీ రాష్ట్ర అధ్యక్షురాలి హస్తిన టూర్‌తో పొత్తు కన్ఫ్యజన్పై క్లారిటీ వస్తుందని భావిస్తున్నారు కాషాయం నేతలు.
ఢిల్లీ పర్యటనలో ఉన్న ఏపీ బీజేపీ అధ్యక్షురాలు పురంధేశ్వరి కేంద్ర హోం మంత్రి అమిత్‌షాతో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా రాష్ట్రానికి సంబంధించిన పలు అంశాలను హోం మంత్రి దృష్టికి తెచ్చారు. ఏపీలో గత నాలుగున్నరేళ్లలో మద్యం విధానంలో జరిగిన అవకతవకలపై సీబీఐతో విచారణ జరిపించాలని ఈ సందర్భంగా అమిత్‌షాకు విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు మద్యం కొనుగోళ్లు, అమ్మకాలకు సంబంధించిన విషయాలపై వినతిపత్రం అందజేశారు. మద్యం విక్రయాలతో వైసీపీ నేతల జేబుల్లోకి భారీగా డబ్బులు వెళ్తున్నాయని గత కొంతకాలంగా పురంధేశ్వరి ఆరోపిస్తు్న్నారు. అదే అంశాన్ని కేంద్ర హోంమంత్రి దృష్టికి తీసుకువెళ్లినట్టు చెప్పారు.
పార్టీకి సంబంధించిన అంశాలపై కూడా అమిత్‌షాతో పురంధేశ్వరి చర్చించినట్టు తెలుస్తోంది. పవన్ కల్యాణ్ ఓవైపు ఎన్డీఏలో ఉన్నానని చెబుతూనే..మరోవైపు టీడీపీతో కలిసి ముందుకు వెళ్తున్నారు. జాయింట్ కమిటీ ఏర్పాటు చేసి.. కార్యాచరణ ప్రకటిస్తున్నారు. లెఫ్ట్ నేతలు కూడా జనసేనతో కలిసిన పరిస్థితుల్లో..ఈ కూటమిలో BJP ఉంటుందా.. లేదా.. అనేది ఉత్కంఠ రేపుతోంది. అయితే కమలం పార్టీ నేతలు మాత్రం ఈ విషయంలో అధిష్టానం నిర్ణయమే ఫైనల్ అంటున్నారు. పవన్ తన అభిప్రాయం తాను చెప్పారు..కానీ ఢిల్లీ నుంచి వచ్చే ఆదేశాల ప్రకారమే తాము ముందుకు వెళ్తామంటున్నారు.
పొత్తు అనేది అప్పటికప్పుడు తీసుకున్న నిర్ణయం కాదనీ.. బీజేపీ దృష్టికి ఈ విషయాన్ని ఎప్పుడో తీసుకెళ్లా అని జనసేన అధినేత పవన్‌కల్యాణ్ చెబుతున్నారు. తప్పనిసరి పరిస్థితుల్లోనే టీడీపీతో పొత్తు నిర్ణయం తీసుకున్నాని స్పష్టం చేశారు. వైసీపీని ఓడించడమే తన టార్గెట్ అనీ.. దాని కోసం ఏమైనా చేస్తానని తేల్చిచెప్పారు. పైగా తమతో బీజేపీ కలిసి వస్తుందనే ఆశాభావం కూడా ఉందంటున్నారు.మరి బీజేపీ-జనసేన-టీడీపీల కన్ఫ్యూజన్ పాలిటిక్స్‌కు పురంధేశ్వరి టూర్‌తో క్లారిటీ వస్తుందేమో చూడాలి.