ఏపీ కేబినెట్ ఇవాళ భేటీ కానుంది. ఈ భేటీపై అందరి దృష్టి ఉంది. ఇందులో హైడ్రో స్టోరేజి, గ్రీన్ ఎనర్జీ ప్రాజెక్టులు,హోటళ్లు, రిసార్టులు కోకాకోలా బెవేరేజెస్ ఏర్పాటుకు క్యాబినెట్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చే అవకాశం ఉంది. ఆలయాల ఉద్యోగులకు రిటైర్మెంట్ వయసును 62 ఏళ్లకు పెంచడంపై క్యాబినెట్ లో చర్చ జరుగుతుంది.
ఇవాళ ఏపీ కేబినెట్ కీలక భేటీ కానుంది. ఈ సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకుంటారు. 70 అంశాలను కేబినెట్ అజెండాలో చేర్చినట్టు సమాచారం. SIPB ఆమోదం తెలిపిన పలు ప్రాజెక్టులపై చర్చించనున్నారు. ఇందులో హైడ్రో స్టోరేజి, గ్రీన్ ఎనర్జీ ప్రాజెక్టులు,హోటళ్లు, రిసార్టులు కోకాకోలా బెవేరేజెస్ ఏర్పాటుకు కేబినెట్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చే అవకాశం ఉంది. ఆలయాల ఉద్యోగులకు రిటైర్మెంట్ వయసును 62 ఏళ్లకు పెంచడంపై కేబినెట్ లో చర్చ జరుగుతుంది. లంక భూములను సాగు చేసుకుంటున్న రైతులకు పట్టాల పంపిణీపైనా చర్చించనుంది జగన్ కేబినెట్. 9 వేల ఎకరాల లంక భూములను 19 వేల మంది లబ్ధిదారులకు పట్టాలు ఇవ్వనుంది ప్రభుత్వం.
రాష్ట్రంలో ఇళ్ల నిర్మాణం వేగవంతం చేయడంపై చర్చించనుంది క్యాబినెట్. పంచాయతీ రాజ్ శాఖలో పలు నిర్ణయాలకు ఆమోద ముద్ర వేయనున్న క్యాబినెట్. జులై,ఆగస్ట్ లో అమలు చేసే సంక్షేమ పథకాలకు ఆమోద ముద్ర వేయనున్న క్యాబినెట్. క్యాబినెట్ భేటీ తర్వాత తాజా రాజకీయ పరిణామాలపై సీఎం జగన్ మంత్రులతో చర్చించే అవకాశం ఉంది.
అమరావతి నగరంలో ఇళ్ల నిర్మాణంపై ఓ నిర్ణయం తీసుకోనున్నారు. దీంతోపాటు సీఎం జగన్, మంత్రుల జిల్లా పర్యటనలపై నిర్ణయం తీసుకోనున్నారు. అమరావతిలో ఇళ్ల నిర్మాణాన్ని ఛాలెంజింగ్‌గా తీసుకుంది జగన్ ప్రభుత్వం. ముఖ్యంగా రాజధాని అమరావతిలో పేదలకు ఇళ్ల స్దలం కేటాయింపు, ఇంటి నిర్మణానికి అవసరమైన సదుపాయాలు కల్పించాలని ప్లాన్ చేస్తోంది.
ఇంటి స్దలాల కేటాయింపులకు సంబంధించిన వ్యవహరంలో కోర్టు నుంచి ఎలాంటి సమస్యలు రాకుండా ఉండేలా నిర్ణయం తీసుకునేందుకు జగన్ క్యాబినెట్ పక్కగా ముందుకు వెళ్తోంది. ఇప్పుడు ఇళ్ల నిర్మాణం పై ప్రభుత్వం ఫోకస్ పెట్టింది.