డిసెంబర్ 29 (ఆంధ్రపత్రిక): ఓ వైపు గ్లామర్ పాత్రలు పోషిస్తేనే.. మరోవైపు నటన ప్రాధాన్యమున్న పాత్రలతో మెప్పిస్తుంది మలయాళ బ్యూటీ అనుపమ పరమేశ్వరణ్. ఈ ఏడాది ’రౌడీ బాయ్స్’తో మంచి ఆరంభం దక్కకపోయిన.. ద్వితియార్థంలో వచ్చిన ’కార్తికేయ`2’తో జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చుకుంది. ఇక ఇటీవలే రిలీజైన ’18పేజీస్’తో మరో విజయం సాధించింది. ప్రస్తుతం ఈ అమ్మడు బ్యాక్ టు బ్యాక్ ప్రాజెక్ట్‌లతో బిజీగా ఉంది. ఇక ఇదిలా ఉంటే అనుపమ నటించిన లేటెస్ట్ మూవీ బట్టర్ ఫ్లై నేరుగా ఓటీటీలో రిలీజైంది. సస్పెన్స్ థ్రిల్లర్ నేపథ్యంలో తెరకెక్కిన ఈ చిత్రం గత రాత్రి నుండి హాట్ స్టార్‌లో స్ట్రీమింగ్ అవుతోంది. ఇప్పటికే మేకర్స్ రిలీజ్ చేసిన పోస్టర్లు, టీజర్ సినిమాపై మంచి బజ్ క్రియేట్ చేశాయి. ఈ ఏడాది ప్రథమార్థంలోనే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం రిలీజ్ డేట్ పలుసార్లు వాయిదా పడుతూ వచ్చింది. ఈ క్రమంలో హాట్‌స్టార్ నుండి మంచి ఆఫర్ రావడంతో మేకర్స్ ఓటీటీ వైపు మొగ్గుచూపారు. ఘంటా సతీష్‌బాబు దర్శకత్వం వహించిన ఈ సినిమాలో నిహాల్ కోదత్య్, భూమిక చావ్లా కీలక పాత్రల్లో నటించారు. జెన్ నెక్ట్స్ మూవీస్ బ్యానర్‌పై రవిప్రకాష్ బోడపాటి, ప్రసాద్ తిరవళ్లూరి, ప్రదీప్ నల్లిమెల్లి సంయుక్తంగా ఈ సినిమాను నిర్మించారు.
Trending
- ఆక్స్ఫర్డ్ భవానిపురం స్కూల్లో బాలల దినోత్సవం వేడుకలు అంగరంగ వైభవంగా నిర్వహించారు.
- ఆక్స్ఫర్డ్ స్కూల్లో ఘనంగా బాలల దినోత్సవం
- AP TET 2024 Results: మరికాసేపట్లో టెట్ ఫలితాలు వచ్చేస్తున్నాయ్..
- AP Mega DSC Notification: మరో 2 రోజుల్లోనే మెగా డీఎస్సీ నోటిఫికేషన్ వచ్చేస్తోంది.. జిల్లాల వారీ ఖాళీలు ఇవే!
- Tirumala: నాగుల చవితి సందర్భంగా రేపు పెద్ద శేష వాహనం సేవ.. దేవేరులతో కలిసి శ్రీవారు భక్తులకు దర్శనం..
- AP News: ట్రెండింగ్ చేస్తున్నారా? అయితే వీళ్లకు చిక్కితే అంతే సంగతులు..
- Running Train: రన్నింగ్ ట్రైన్ నుంచి కాలువలోకి దూకేసిన మహిళ.. ఆ తర్వాత ఏం జరిగిందంటే?
- సెక్యూరిటీ గార్డు డాక్టర్ అయ్యాడు! ఏకంగా రోగికి కట్టుకట్టి ఇంజెక్షన్ కూడా ఇచ్చాడు!