విజయవాడ,అక్టోబర్ 20 (ఆంధ్రపత్రిక): సిత్రాంగ్ తుపాను ఏపీతో సహా పలు రాష్ట్రాలను హడలెత్తిస్తోంది. బంగాళాఖాతంలో ఏర్పడిన ఈ తుపాను క్షణక్షణం దిశను మార్చుకుంటూ తీరప్రాంత ప్రజలను కలవరపాటుకు గురి చేస్తోంది. అయితే సిత్రాంగ్ తుపాను ప్రభావం ఆంధప్రదేశ్పై ఉండే అవకాశాలు దాదాపు లేనట్టేనని వాతావరణ శాఖ అధికారులు చెబు తున్నారు. ఇది ఉత్తర ఒడిశా, పశ్చిమ బెంగాల్ వైపు కదిలే పరిస్థితి ఉందని అంచనా వేస్తు న్నారు. ప్రస్తుతం ఉత్తర అండమాన్ సముద్ర పరిసరాల్లో కొనసాగు తున్న ఉపరితల ఆవర్తనం రానున్న 24 గంటల్లో బంగాళాఖాతంలో అల్పపీడనంగా మారే అవకాశం ఉంది. ఇది పశ్చిమ వాయువ్య దిశగా పయనించి శనివారం నాటికి వాయుగుండంగా.. ఆ తర్వాత 48 గంటల్లో తుపానుగా బలపడే అవకాశముందని వాతావరణ శాఖ అధికారులు పేర్కొ న్నారు. మొదట ఇది ఏపీ, ఒడిశా మధ్య తీరం దాటవచ్చని భావించారు. కానీ ఏపీ ఒడిశా తీరం వైపు వచ్చినా.. మధ్యలో దిశ మార్చుకుని ఉత్తర ఒడిశా పశ్చిమబెంగాల్ వైపు కదులు తుందని అధికారులు అంచనా వేస్తున్నారు. మరోవైపు ఏపీలో గత 15 రోజులుగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. దీంతో సముద్ర ఉపరితల ఉష్ణోగ్రతలు బాగా తగ్గిపోయాయి. అదే సమయంలో పశ్చిమబెంగాల్ తీరంలో సముద్ర ఉష్ణోగ్రతలు ఇక్కడికంటే అధికంగా ఉన్నాయి. అందువల్ల తుపాను పశ్చిమబెంగాల్వైపు కదిలేందుకు ఎక్కువ అవకాశాలు న్నాయంటున్నారు అధికారులు. వాతావరణంలో అనూహ్య మార్పులు జరిగితే తప్ప ఏపీపై తుపాను ప్రభావం ఉండదని వాతావరణ శాఖ చెబుతోంది
Trending
- AP TET 2024 Results: మరికాసేపట్లో టెట్ ఫలితాలు వచ్చేస్తున్నాయ్..
- AP Mega DSC Notification: మరో 2 రోజుల్లోనే మెగా డీఎస్సీ నోటిఫికేషన్ వచ్చేస్తోంది.. జిల్లాల వారీ ఖాళీలు ఇవే!
- Tirumala: నాగుల చవితి సందర్భంగా రేపు పెద్ద శేష వాహనం సేవ.. దేవేరులతో కలిసి శ్రీవారు భక్తులకు దర్శనం..
- AP News: ట్రెండింగ్ చేస్తున్నారా? అయితే వీళ్లకు చిక్కితే అంతే సంగతులు..
- Running Train: రన్నింగ్ ట్రైన్ నుంచి కాలువలోకి దూకేసిన మహిళ.. ఆ తర్వాత ఏం జరిగిందంటే?
- సెక్యూరిటీ గార్డు డాక్టర్ అయ్యాడు! ఏకంగా రోగికి కట్టుకట్టి ఇంజెక్షన్ కూడా ఇచ్చాడు!
- చాప్టర్ 3: చెన్నైలో కొడాలి అరెస్ట్.. రజనీ కూతురు బిగ్ స్టెప్..
- Telangana Police: మళ్లీ మొదలైన లోన్ యాప్ ఆగడాలు.. పోలీసుల లేటెస్ట్ అలెర్ట్..!