నేపథ్య గాయని వాణీజయరామ్ కన్నుమూత
చిత్రసీమలో మరో విషాదం చోటుచేసుకుంది. విశ్వనాథ మరణంతో తేరుకోని పరిశ్రమకు మరో దుర్వార్త చేరింది. ప్రముఖ నేపథ్య గాయని వాణీజయరామ్ కన్ను మూశారు. వాణీ జయరామ్(78) చెన్నైలోని తన స్వగృహంలో తుదిశ్వాస విడిచారు. 1945 నవంబర్ 30న దురైస్వామి, పద్మావతి దంపతులకు వాణీ జయరామ్ జన్మించారు. తమిళనాడులోని వెల్లూరు ఈమె స్వస్థలం. హిందూస్థానీ క్లాసికల్ సింగింగ్‌లో ప్రావీణ్యం పొందిన వాణీ జయరామ్ తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ హిందీ భాషల్లో 4500లకు పైగా పాటలు పాడారు. అందులో తెలుగులో 1000కు పైగా తెలుగు పాటలే! కెవి.మహదేవన్, ఎం.ఎస్. విశ్వనాధన్, ఇళయరాజా, పెండాల్య, చక్రవర్తి, సాలూరి రాజేశ్వరరావు సంగీతంలో ఎక్కువ పాటలు పాడారు. సంగీత రంగానికి ఆమె చేసిన సేవలకు గానూ కేంద్ర ప్రభుత్వం ఆమెను పద్మ భూషణ్ అవార్డును ప్రకటించగా, అది అందుకోకుండానే ఆమె కన్ను మూయడం బాధాకరం. మూడు జాతీయ పురస్కారాలను కూడా ఆమె అందుకున్నారు. వాణీ జయరామ్ మరణంతో సంగీతలోకం కన్నీరుమున్నీరైంది. సినీ ప్రముఖులు ఆమె ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తున్నారు.
Trending
- ఆక్స్ఫర్డ్ భవానిపురం స్కూల్లో బాలల దినోత్సవం వేడుకలు అంగరంగ వైభవంగా నిర్వహించారు.
- ఆక్స్ఫర్డ్ స్కూల్లో ఘనంగా బాలల దినోత్సవం
- AP TET 2024 Results: మరికాసేపట్లో టెట్ ఫలితాలు వచ్చేస్తున్నాయ్..
- AP Mega DSC Notification: మరో 2 రోజుల్లోనే మెగా డీఎస్సీ నోటిఫికేషన్ వచ్చేస్తోంది.. జిల్లాల వారీ ఖాళీలు ఇవే!
- Tirumala: నాగుల చవితి సందర్భంగా రేపు పెద్ద శేష వాహనం సేవ.. దేవేరులతో కలిసి శ్రీవారు భక్తులకు దర్శనం..
- AP News: ట్రెండింగ్ చేస్తున్నారా? అయితే వీళ్లకు చిక్కితే అంతే సంగతులు..
- Running Train: రన్నింగ్ ట్రైన్ నుంచి కాలువలోకి దూకేసిన మహిళ.. ఆ తర్వాత ఏం జరిగిందంటే?
- సెక్యూరిటీ గార్డు డాక్టర్ అయ్యాడు! ఏకంగా రోగికి కట్టుకట్టి ఇంజెక్షన్ కూడా ఇచ్చాడు!