సింగ`4 కు కథ రెడీ చేస్తున్న దర్శకుడు
నవంబర్ 10 (ఆంధ్రపత్రిక): తమిళ ప్రేక్షకులతో పాటు తెలుగు ప్రేక్షకులకు కూడా నచ్చిన ’సింగం’ సిరీస్ నుండి మరో సినిమా రాబోతుందని సమాచారం. ఈ విషయాన్ని స్వయంగా ఆ సినిమాకు పని చేయబోతున్న టెక్నీషియన్స్ యూనిట్ సభ్యులు తెలియజేశారు. వారు చెబుతున్న దాని ప్రకారం ’సింగం 4’ సినిమా కోసం దర్శకుడు హరి కథను రెడీ చేస్తున్నాడట. సింగం 4 ను కేవలం సౌత్ ఆడియన్స్ కోసం అన్నట్లుగా కాకుండా పాన్ ఇండియా రేంజ్లో ఉండేలా ప్లాన్ చేస్తున్నట్లుగా సమాచారం అందుతోంది. అధ్బుతమైన యాక్షన్ ఎంటర్ టైనర్స్గా సింగం యొక్క మూడు సినిమా లు కూడా ప్రేక్షకులను ముఖ్యంగా మాస్ ఆడియన్స్ ను అలరించిన విషయం తెల్సిందే. అందుకే నాల్గవ సింగం కోసం ప్రతి ఒక్కరూ ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. సూర్య హీరోగా హరి దర్శకత్వంలో వచ్చిన సింగం ను తెలుగు లో కూడా అదే రేంజ్లో విడుదల చేయడం.. అక్కడ మాదిరిగానే ఇక్కడ కూడా భారీ విజయాలను సొంతం చేసుకోవడం జరిగింది. అక్కడ ఇక్కడ కలిపి అప్పట్లో భారీ వసూళ్లు సొంతం చేసుకున్న సింగం ఇప్పుడు అంతకు మించి అన్నట్లుగా వసూళ్లు నమోదు చేయబోతున్నట్లుగా సమాచారం అందుతోంది. ప్రస్తుతం హరి వేరే సినిమాతో బిజీగా ఉన్నాడు. అంతే కాకుండా సూర్య కూడా బిజీ బిజీగా సినిమాలు చేస్తూ ఉన్నాడు. కనుక సింగం 4 సినిమా పట్టాలెక్కాలంటే కనీసం ఆరు ఏడు నెలల సమయం పడుతుంది అంటూ తమిళ సినీ వర్గాల ద్వారా సమాచారం అందుతోంది. నటుడిగా సూర్యకు సౌత్‌తో పాటు ఉత్తర భారతంలో కూడా మంచి గుర్తింపు తెచ్చి పెట్టిన సినిమా సింగం. కనుక ఆ సీక్వెల్‌కు సూర్య ఎప్పుడు కూడా సిద్ధంగా ఉంటాడు. కాస్త విభిన్నంగా మాస్ ఆడియన్స్ ను ఆకట్టుకునే విధంగా సింగం 4 ఉంటే చాలు భారీగా వసూళ్లు నమోదు చేసే అవకాశం ఉంది అంటున్నారు.