జనవరి 02 (ఆంధ్రపత్రిక): సమంత ప్రధాన పాత్రలో గుణశేఖర్ దర్శకత్వంలో నిర్మించిన ’శాకుంతలం’ సినిమాకు అడుగడుగునా అడ్డంకులే ఎదురవుతున్నాయి. రేండెళ్ల కిందట మొదలైన ఈ సినిమా ఇంకా విడుదలకు నోచుకోలేదు. అప్పుడొస్తుంది, ఇప్పుడొస్తుంది అని చిత్రబృందం పలు డేట్లు ప్రకటించినా.. క్యాలెండర్‌లో డేట్లు మారుతున్నాయి తప్ప సినిమా మాత్రం రిలీజ్ కావడం లేదు. గతేడాది నవంబర్‌లో ఈ సినిమాను కచ్చితంగా రిలీజ్ చేస్తున్నట్లు గుణ శేఖర్ ఓ వీడియోను కూడా రిలీజ్ చేశాడు. కానీ మళ్లీ పోస్ట్‌పోన్ చేసి సమంత అభిమానులను నిరాశపరిచాడు. తాజాగా చిత్రయూనిట్ మరో కొత్త డేట్‌తో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ సినిమాను మహా శివరాత్రి కానుకగా ఫిబ్రవరి 17న ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నట్లు చిత్రబృందం ప్రకటించింది. అయితే ఈ రిలీజ్ డేట్ సమంత అభిమానులను టెన్షన్ పెడుతుంది. ఎందుకంటే అదే రోజున మరో మూడు సినిమాలు విడుదల కానున్నాయి. ధనుష్ హీరోగా నటిస్తున్న సార్ మూవీ అదే రోజున రిలీజ్ కానుంది. సితార సంస్థ నిర్మిస్తున్న ప్రాజెక్ట్ కావడంతో ఈ సినిమాపై ప్రేక్షకులలో మంచి అంచనాలే ఉన్నాయి. ఇక విశ్వక్ సేన్ నటించి, దర్శకత్వం వహించిన దాస్ కా ధమ్కీ అదే రోజున రిలీజ్ కానుంది. మొన్నటి వరకు ఈ సినిమాపై అంతగా అంచనాలు లేవు. కానీ గత నెలలో రిలీజైన ట్రైలర్ సినిమాపై మంచి బజ్ తీసుకొచ్చింది. వీటితో పాటుగా కిరణ్ అబ్బవరం నటిస్తున్న వినరో భాగ్యము విష్ణు కథ సినిమా కూడా అదే రోజున రిలీజ్ కానుంది. ఈ సినిమాపై ప్రేక్షకుల్లో అంతగా బజ్ లేదు. కానీ గీతా ఆర్ట్స్ చివరి నిమిషంలో ఏదో ఒక మాయ చేసి సినిమాపై భారీ హైప్ క్రియేట్ చేస్తారు. ఇన్ని సినిమాల మధ్యన శాకుంతలం రిలీజ్ చేస్తున్నారంటే రిస్క్ అనే చెప్పాలి. పైగా ఈ సినిమాకు దాదాపు 80కోట్ల బ్జడెట్ అయింది. ఆ మూడు సినిమాలన్నిటి బ్జడెట్ కలిపినా ఈ ఒక్క సినిమా బడ్జెట్ అంత ఉండదు. ఇక ఈ సినిమాకు గుణశేఖర్ నిర్మాత కావడం మరో విశేషం. ఇన్ని ట్విస్టుల మధ్య సమంత అభిమానులకు ఏదైనా సంతృప్తి ఉందంటే అది దిల్‌రాజే. ఈ సినిమాకు దిల్‌రాజు డిస్టిబ్యూట్రర్‌గా వ్యవహరిస్తున్నాడు. కాబట్టి మిగితా సినిమాలతో పోలిస్తే ఈ సినిమాకు ఎక్కువగా థియేటర్లు దొరికే చాన్స్ ఉంది. ఇక ఈ సినిమా పాన్ ఇండియా స్థాయిలో 3డీలో రిలీజ్ కానుంది.
Trending
- ఆక్స్ఫర్డ్ భవానిపురం స్కూల్లో బాలల దినోత్సవం వేడుకలు అంగరంగ వైభవంగా నిర్వహించారు.
- ఆక్స్ఫర్డ్ స్కూల్‌లో ఘనంగా బాలల దినోత్సవం
- AP TET 2024 Results: మరికాసేపట్లో టెట్ ఫలితాలు వచ్చేస్తున్నాయ్..
- AP Mega DSC Notification: మరో 2 రోజుల్లోనే మెగా డీఎస్సీ నోటిఫికేషన్ వచ్చేస్తోంది.. జిల్లాల వారీ ఖాళీలు ఇవే!
- Tirumala: నాగుల చవితి సందర్భంగా రేపు పెద్ద శేష వాహనం సేవ.. దేవేరులతో కలిసి శ్రీవారు భక్తులకు దర్శనం..
- AP News: ట్రెండింగ్ చేస్తున్నారా? అయితే వీళ్లకు చిక్కితే అంతే సంగతులు..
- Running Train: రన్నింగ్ ట్రైన్ నుంచి కాలువలోకి దూకేసిన మహిళ.. ఆ తర్వాత ఏం జరిగిందంటే?
- సెక్యూరిటీ గార్డు డాక్టర్ అయ్యాడు! ఏకంగా రోగికి కట్టుకట్టి ఇంజెక్షన్ కూడా ఇచ్చాడు!