ఎప్రిల్ 29న విడుదలకు తేదీ ప్రకటన
జనవరి 02 (ఆంధ్రపత్రిక): మెగా మేనల్లుడు వైష్ణవ్ తేజ్ హిట్టు కొట్టి రెండేళ్లయింది. ఉప్పెన తర్వాత రిలీజైన రెండు సినిమాలు డిజాస్టర్లుగా మిగిలాయి. ఉప్పెన వంద కోట్ల గ్రాస్ సాధిస్తే.. ఆ తర్వాత రిలీజైన రెండు సినిమాలు కలిపి కూడా 50కోట్ల గ్రాస్ కూడా సాధించలేకపోయాయి. ప్రస్తుతం వైష్ణవ్ సితార ఎంటర్టైనమెంట్స్ బ్యానర్లో ఓ యాక్షన్ సినిమా చ్తేస్తున్నాడు. శ్రీకాంత్ దర్శకుడిగా పరిచయమవుతూ ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నాడు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతుంది. ఇప్పటికే రిలీజైన డైలాగ్ గ్లింప్స్ సినిమాపై మంచి అంచనాలే నెలకొల్పాయి. ఇదిలా ఉంటే తాజాగా ఈ సినిమా రిలీజ్ డేట్‌ను చిత్రబృందం ప్రకటించింది. ఈ సినిమాను ఏప్రిల్ 29న రిలీజ్ చేయనున్నట్లు చిత్రబృందం తాజాగా పోస్టర్‌ను రిలీజ్ చేసింది. పోస్టర్లో వైష్ణవ్ కంచె వెనుకాల రగ్గుడ్ లుక్‌లో మాస్ అవతారంలో కనిపిస్తున్నాడు. ఈ సినిమాను సితార సంస్థతో కలిసి తివిక్రమ్ తన సొంత బ్యానర్ ఫ్యార్చూన్ ఫోర్ సినిమాస్ బ్యానర్‌పై సంయుక్తంగా నిర్మిస్తున్నాడు. వైష్ణవ్‌కు జోడీగా శ్రీలీల నటిస్తుంది. కాగా ఈ సినిమాకు వారం రోజుల ముందు సాయి ధరమ్ తేజ్ నటిస్తున్న విరూపాక్ష విడుదల కానుంది. కార్తిక్ దండు దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం పాన్ ఇండియా సినిమాగా రిలీజ్ కానుంది. ఇలా వారం గ్యాప్‌లో మెగా మేనల్లులు పోటీ పడటంతో ప్రేక్షకుల్లో ఆసక్తి నెలకొంది.