లెమన్ గ్రూప్ అనే సైబర్ క్రైమ్ సంస్థ ప్రపంచవ్యాప్తంగా దాదాపు 9 మిలియన్ల ఆండ్రాయిడ్ పరికరాల్లో “గెరిల్లా” అనే మాల్వేర్ను ఇన్స్టాల్ చేసినట్లు వెల్లడైంది. స్మార్ట్ఫోన్లు, గడియారాలు, టీవీలు సహా ఆండ్రాయిడ్ పరికరాలకు ఈ మాల్వేర్ సోకుతోంది.
Malware Attack: ప్రస్తుత కాలంలో మాల్వేర్ దాడులు కొత్త కాదు. తరచుగా సైబర్ హాకర్లు వ్యక్తులను లక్ష్యంగా చేసుకుని వారి డేటాను దొంగిలించడానికి మాల్వేర్తో ఫోన్లు, ల్యాప్‌టాప్‌లు లేదా డెస్క్‌టాప్‌ల వంటి వారి స్మార్ట్ పరికరాలను ఇన్ఫెక్ట్ చేస్తారు. డేటా తర్వాత బ్లాక్ మార్కెట్‌కు విక్రయించి సొమ్ము చేసుకుంటారు. అలాగే ఈ డేటా ఇతర హానికరమైన కార్యకలాపాలను ప్రారంభించడానికి ఉపయోగిస్తారు. సైబర్ సెల్, టెక్ కంపెనీలు ఈ ఆన్లైన్ నేరస్తులను కనిపెట్టడానికి, సెక్యూరిటీ అప్డేట్లను క్రమం తప్పకుండా విడుదల చేయడానికి నిరంతరం ప్రయత్నిస్తున్నా సైబర్ దాడులు మాత్రం తగ్గడం లేదు. ఇటీవల వెల్లడైన షాకింగ్ నివేదికలో లెమన్ గ్రూప్ అనే సైబర్ క్రైమ్ సంస్థ ప్రపంచవ్యాప్తంగా దాదాపు 9 మిలియన్ల ఆండ్రాయిడ్ పరికరాల్లో “గెరిల్లా” అనే మాల్వేర్ను ఇన్స్టాల్ చేసినట్లు వెల్లడైంది. స్మార్ట్ఫోన్లు, గడియారాలు, టీవీలు సహా ఆండ్రాయిడ్ పరికరాలకు ఈ మాల్వేర్ సోకుతోంది. జపనీస్ బహుళజాతి సైబర్ సెక్యూరిటీ సాఫ్ట్వేర్ కంపెనీ ట్రెండ్ మైక్రో తాజా నివేదిక ప్రకారం ఈ మాల్వేర్ ఆండ్రాయిడ్ వినియోగదారుల ఖాతాలు, వ్యక్తిగత డేటాను తస్కరించిందని పేర్కొంది. ఈ మాల్వేర్ వల్ల కలిగే ఇబ్బందులు ఏంటో ఓ సారి తెలుసుకుందాం.
అదనపు పేలోడ్లను లోడ్ చేయడం, ఎస్ఎంఎస్ నుండి వన్-టైమ్ పాస్‌వర్డ్‌లను తస్కరించడం, వైరస్ సోకిన పరికరం నుండి రివర్స్ ప్రాక్సీని సెటప్ చేయడం, వాట్సాప్ సెషన్లను హైజాక్ చేయడం వంటి అనేక హానికరమైన కార్యకలాపాలను నిర్వహించడానికి స్కామర్లు పరికరాలలో ముందే ఇన్స్టాల్ చేసిన ఈ మాల్వేర్ను ఉపయోగిస్తున్నారని నివేదికలు వెల్లడిస్తున్నాయి. ప్రపంచవ్యాప్తంగా వ్యాపంగా దాదాపు 180 దేశాల్లో ఈ మాల్వేర్ వల్ల ఇబ్బందిపడుతున్నట్లు తెలిసింది. ముఖ్యంగా సెలబ్రిటీలనే లక్ష్యంగా చేసుకుని ఈ మాల్వేర్తో దాడి చేస్తున్నారని నివేదికలు వెల్లడిస్తున్నాయి.
అమెరికా, మెక్సికో, ఇండోనేషియా, థాయ్‌లాండ్, రష్యా, దక్షిణాఫ్రికా, ఇండియా, అంగోలా, ఫిలిప్పీన్స్, అర్జెంటీనా వంటి దేశాల్లోని స్మార్ట్ ఫోన్ యూజర్లు ఈ మాల్వేర్ ద్వారా ఇబ్బందిపడుతున్నారు. బాధితులపై దాడి చేసేందుకు లెమన్ గ్రూప్ గెరిల్లా మాల్వేర్ ఇతర రకాల మాల్వేర్ సాధనాలను ఇన్స్టాల్ చేసిందని నివేదిక వెల్లడించింది. లెమన్ గ్రూప్ పరికరాలకు ఎలా సోకుతుందనే దానిపై కొత్త రామ్‌తో మళ్లీ ఫ్లాష్ చేసిన పరికరాలలో ఇది తరచుగా ముందే ఇన్స్టాల్ అవుతుందని నిపుణులు కనుగొన్నారు.
గెరిల్లా మాల్వేర్ మీ ఫోన్లో ఉందా? తెలుసుకోండిలా?
మాల్వేర్ ఇన్ఫెక్షన్కు సంబంధించిన కొన్ని సంకేతాలలో అసాధారణమైన బ్యాటరీ డ్రెయిన్, పాప్-అప్ ప్రకటనలు, మీ పరికర సెట్టింగ్‌లలో వివరించలేని మార్పులు వంటి గమినిస్తే కచ్చితంగా ఈ మాల్వేర్ మీ ఫోన్లో ఉన్నట్లేనని టెక్ నిపుణులు చెబుతున్నారు. ముఖ్యంగా ఈ మాల్వేర్ తనిఖీ కోసం మీ పరికరాన్ని సెక్యూరిటీ స్కాన్ చేయడం ముఖ్యం.
గెరిల్లా మాల్వేర్ నుంచి రక్షణ ఇలా
ఆండ్రాయిడ్ పరికరాల వినియోగదారులకు లెమన్ గ్రూప్ తీవ్రమైన ముప్పుగా పరిణమించింది. ప్రమాదాల గురించి తెలుసుకోవడం, మీ పరికరాన్ని హ్యాక్ చేయకుండా లేదా సైబర్ స్కామర్ల బారిన పడకుండా రక్షించడానికి చర్యలు తీసుకోవడం చాలా ముఖ్యం. గెరిల్లా మాల్వేర్ నుండి మీ ఆండ్రాయిడ్ పరికరాన్ని రక్షించడానికి ఈ జాగ్రత్తలు తప్పనిసరి
మీ ఆండ్రాయిడ్ పరికరంలో గూగుల్ ప్లే స్టోర్‌ను, ఐ ఫోన్లో యాపిల్ యాప్ స్టోర్ నుంచి ఏదైనా యాప్స్ డౌన్లోడ్ చేసుకోవాలి. మాల్వేర్ సోకే అవకాశం ఉన్న థర్డ్ పార్టీ యాప్స్ జోలికి వెళ్లకూడదు.
ఏదైనా యాప్‌ను ఇన్స్టాల్ చేసిప్పుడు అది నిర్దిష్ట అనుమతుల కోరుతుంది. ఆ సమయంలో నియమ నిబంధనలు స్పష్టం చదవాలి.
ఎప్పటికప్పుడు మీ ఫోన్లోని యాప్స్‌ను అప్ డేట్‌గా ఉంచుకోవాలి. ఇలా చేయడం ద్వారా మాల్వేర్ మీ ఫోన్లోకి రాకుండా అడ్డుకోవచ్చు.