నవంబర్ 18 (ఆంధ్రపత్రిక): సంగీత, తిరువీర్, కావ్య కళ్యాణ్ రామ్ ప్రధాన పాత్రల్లో సాయి కిరణ్ తెరకెక్కించిన చిత్రం ’మసూద’. రాహుల్ యాదవ్ నిర్మించిన ఈ హారర్ డ్రామా శుక్రవారం విడుదలయ్యింది. ఒక ట్రూ హారర్ డ్రామాగా రూపొందిన ’మసూద’ చూసి థ్రిల్ ఫీల్ అయ్యాం అని మేకర్స్ అన్నారు. హై టెక్నికల్ వాల్యూస్‌తో రూపొందించిన ఈ చిత్రాన్ని థియేటర్లో చూస్తేనే మంచి ఎక్స్‌పీరియెన్స్ కలుగు తుందన్నారు. తమ చిన్నతనంలో చూసిన అమ్మోరు, దేవి చిత్రాలు ఏవిధంగా అయితే ప్రేక్షకుల్ని అలరించాయో, అంతే జెన్యూన్‌గా ’మసూద’ మెప్పిస్తుందన్నారు. నీలమ్ (సంగీత) ఒక ప్రైవేట్ స్కూల్లో సైన్స్ టీచర్. భర్త నుంచి విడిపోయిన తన ఏకైక కూతురు నాజియా (బాంధవి శ్రీధర్)ను చదివించుకుంటూ ఒక అపార్ట్మెంట్లో ఉంటుంది. అదే అపార్ట్మెంట్లో ఉండే గోపి (తిరువీర్) వీరికి చేదోడు వాదోడుగా ఉంటాడు. అయితే నాజియా ఉన్నట్లుండి ఒక రోజు విచిత్రంగా ప్రవర్తించడం మొదలుపెడుతుంది. ముందు డాక్టర్ కు చూపించినా ఫలితం ఉండదు. దీంతో ఆమెను పీర్ బాబా దగ్గరికి తీసుకెళ్తారు. అప్పుడే ఆమెను మసూద అనే ఆత్మ పట్టి పీడిస్తోందని అర్థమవుతుంది. ఇంతకీ ఆ మసూద ఎవరు.. నాజియాను ఆమె ఎందుకు ఆవహించింది.. ఈ ఆత్మ నుంచి నాజియాను బయటపడేయడానికి పీర్ బాబతో కలిసి నీలమ్.. గోపీ ఏం చేశారు అన్నది మిగతా కథ. కొంత కాలం హార్రర్ కామెడీలు బాగానే నడిచినా.. అవన్నీ ఒక మూస పద్ధతిలో సాగి ఆ జానర్ అటకెక్కేసింది. ఐతే ఇప్పుడు కొత్త దర్శకుడు సాయికిరణ్.. పూర్తిగా హార్రర్ జానర్‌కు కట్టుబడి తీసిన సినిమా.. మసూద. రెగ్యులర్ హార్రర్ సినిమాలకు భిన్నంగా ఒక బ్యాక్ డ్రాప్ తీసుకుని.. అతను ప్రేక్షకులకు థ్రిల్స్.. చిల్స్ ఇవ్వడానికి ప్రయత్నించాడు. ఆ నేపథ్యమే సినిమాకు ఒక యునీక్ ఫీల్ తీసుకొచ్చింది. సినిమాలో కొన్ని మూమెంట్స్ చూసి ఒళ్లు జిల్లుమనడం ఖాయం. హార్రర్ సినిమాల్లో చాలా వరకు ఒక అమ్మాయికి దయ్యం పట్టడం.. ముందు వాళ్లు ఏవేవో ప్రయత్నాలు చేసి.. చివరికి ఒక స్వావిూజీ లేదా పీర్ బాబా దగ్గరికి వెళ్లడం.. ఆ వ్యక్తి దయ్యం వదలగొట్టే పక్రియ చేపట్టడం.. ఈ క్రమంలో దయ్యం తాలూకు గతం వెల్లడి కావడం.. చివరగా ఏదో ఒకటి చేసి దయ్యాన్ని సాగనంపడం.. ఇదే టెంప్లేట్ ఉంటుంది. ’మసూద’ కూడా ఈ ఫార్మాట్లో సాగే సినిమానే. కాకపోతే ఈ కథను నరేట్ చేసే విధానంలో కొంచెం వైవిధ్యం కనిపిస్తుంది. అంతే కాక దయ్యం ప్లాష్ బ్యాక్ కూడా విభిన్నంగా అనిపిస్తుంది. దయ్యాన్ని వదలగొట్టే బాబాల గురించి అందరూ చూపిస్తారు కానీ.. ఒక ముస్లిం అమ్మాయిని దయ్యంగా చూపించి.. తన నేపథ్యాన్ని సరికొత్తగా నరేట్ చేసిన తీరులో దర్శకుడు తన ప్రత్యేకతను చాటుకున్నాడు. ప్రేక్షకులు సినిమాలో కొత్తగా ఫీలయ్యేది దయ్యం ప్లాష్ బ్యాక్ విషయంలోనే. ఐతే దయ్యం పాత్ర నేపథ్యం అదీ కొత్తగా అనిపించినా.. ప్రేక్షకులను ఆశ్చర్యపరిచే ట్విస్టులైతే ఏవిూ కనిపించవు. పతాక సన్నివేశాలు బాగానే అనిపించినా.. ఏదైనా సర్పైజ్ర్ ఉంటుందని ఆశించే ప్రేక్షకులకు నిరాశ తప్పదు. చివరి గంటలో వయొలెన్స్ డోస్ బాగా ఎక్కువే. రక్తంతో తెర తడిసి ముద్దయిపోయింది. ’మసూద’ టీం పడ్డ కష్టం అయితే తెర విూద కనిపిస్తుంది. ఉన్నంతలో మంచి ప్రయత్నమే చేశారు. కానీ హార్రర్ సినిమాలైనా.. థ్రిల్లర్లయినా.. సాగతీతగా అనిపించకూడదు. కథనం పరుగులు పెట్టాలి.
Trending
- ఆక్స్ఫర్డ్ భవానిపురం స్కూల్లో బాలల దినోత్సవం వేడుకలు అంగరంగ వైభవంగా నిర్వహించారు.
- ఆక్స్ఫర్డ్ స్కూల్లో ఘనంగా బాలల దినోత్సవం
- AP TET 2024 Results: మరికాసేపట్లో టెట్ ఫలితాలు వచ్చేస్తున్నాయ్..
- AP Mega DSC Notification: మరో 2 రోజుల్లోనే మెగా డీఎస్సీ నోటిఫికేషన్ వచ్చేస్తోంది.. జిల్లాల వారీ ఖాళీలు ఇవే!
- Tirumala: నాగుల చవితి సందర్భంగా రేపు పెద్ద శేష వాహనం సేవ.. దేవేరులతో కలిసి శ్రీవారు భక్తులకు దర్శనం..
- AP News: ట్రెండింగ్ చేస్తున్నారా? అయితే వీళ్లకు చిక్కితే అంతే సంగతులు..
- Running Train: రన్నింగ్ ట్రైన్ నుంచి కాలువలోకి దూకేసిన మహిళ.. ఆ తర్వాత ఏం జరిగిందంటే?
- సెక్యూరిటీ గార్డు డాక్టర్ అయ్యాడు! ఏకంగా రోగికి కట్టుకట్టి ఇంజెక్షన్ కూడా ఇచ్చాడు!