తెదేపా అధినేత చంద్రబాబు
అమరావతి,ఫిబ్రవరి 4 (ఆంధ్రపత్రిక): ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి నిర్లక్ష్యం, నిరాసక్తత వల్ల రాష్ట్రంలో అంకుర సంస్థల వ్యవస్థ ధ్వంసమైందని తెదేపా అధినేత చంద్రబాబు మండిపడ్డారు.యువ పారిశ్రామికవేత్తల ఆకాంక్షలను జగన్ ప్రభుత్వం దెబ్బతీసిందన్నారు. ఈ పోటీ ప్రపంచంలో రాష్ట్ర యువత భవిష్యత్ తలచుకుంటే బాధగా ఉందని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. విజయవాడలో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. 2019 వరకు, దేశంలోనే అత్యధికంగా అంకుర సంస్థలకు ఆంధ్రప్రదేశ్ గమ్యస్థానంగా ఉండేదని, స్టార్టప్‌లు అభివృద్ధి చెందడానికి విశాఖలో అనుకూల వాతావరణాన్ని తీసుకొచ్చామని అన్నారు. తెదేపా ప్రభుత్వం విశాఖలో ఏర్పాటు చేసిన వ్యవస్థ ద్వారా అంకుర సంస్థల ఏర్పాటుకు ఎంతో కృషి జరిగిందన్నారు. అలాంటిది స్టార్టప్‌ల అభివృద్ధిలో బిహార్ కంటే ఇప్పుడు ఏపీ దిగువన ఉందని చంద్రబాబు విమర్శించారు.
Trending
- AP TET 2024 Results: మరికాసేపట్లో టెట్ ఫలితాలు వచ్చేస్తున్నాయ్..
- AP Mega DSC Notification: మరో 2 రోజుల్లోనే మెగా డీఎస్సీ నోటిఫికేషన్ వచ్చేస్తోంది.. జిల్లాల వారీ ఖాళీలు ఇవే!
- Tirumala: నాగుల చవితి సందర్భంగా రేపు పెద్ద శేష వాహనం సేవ.. దేవేరులతో కలిసి శ్రీవారు భక్తులకు దర్శనం..
- AP News: ట్రెండింగ్ చేస్తున్నారా? అయితే వీళ్లకు చిక్కితే అంతే సంగతులు..
- Running Train: రన్నింగ్ ట్రైన్ నుంచి కాలువలోకి దూకేసిన మహిళ.. ఆ తర్వాత ఏం జరిగిందంటే?
- సెక్యూరిటీ గార్డు డాక్టర్ అయ్యాడు! ఏకంగా రోగికి కట్టుకట్టి ఇంజెక్షన్ కూడా ఇచ్చాడు!
- చాప్టర్ 3: చెన్నైలో కొడాలి అరెస్ట్.. రజనీ కూతురు బిగ్ స్టెప్..
- Telangana Police: మళ్లీ మొదలైన లోన్ యాప్ ఆగడాలు.. పోలీసుల లేటెస్ట్ అలెర్ట్..!