హైదరాబాద్:డిసెంబర్ 15 : ఎమ్మెల్యేలకు ఎరకేసును సీబీఐ లేదా ప్రత్యేక దర్యాప్తు సంస్థతో విచారణ జరిపించాలంటూ నిందితులు, భాజపా (%దీజీూ%) దాఖలు చేసిన పిటిషన్‌పై హైకోర్టు ఇవాళ విచారణ జరిపింది.ఈ సందర్భంగా సీఏం ఏర్పాటు చేసిన మీడియా సమావేశం గురించి భాజపా తరఫు న్యాయవాది ప్రస్తావిస్తూ…అక్కడి వివరాలను కోర్టుకు వివరించారు. కీలకమైన కేసు దర్యాప్తు దశలో ఉంటే వివరాలెలా బయటకి వెళ్లాయని పిటిషనర్ల తరఫు న్యాయవాది కోర్టు దృష్టికి మరోసారి తీసుకెళ్లారు. అవినీతి నిరోధక చట్టంలోని సెక్షన్ల కింద కేసులు నమోదయ్యాయని, అలాంటప్పుడు శాంతిభద్రతల విభాగంతో ఎలా దర్యాప్తు చేయిస్తున్నారని వాదించారు. ఆ కేసులను అనిశాతోనే విచారణ జరిపించాలన్న నిబంధన ఉందని న్యాయస్థానం దృష్టికి తీసుకెళ్లారు.సెక్షన్ 17బీ ప్రకారం మెట్రోపాలిటన్ ఏసీపీ స్థాయి అధికారి కూడా దర్యాప్తు చేయొచ్చని అడ్వొకేట్ జనరల్ వాదించారు. కేసు విషయాలు బయటకి పొక్కుతున్నాయని, అందుకే రాష్ట్రప్రభుత్వం ఏర్పాటు చేసిన సిట్‌తో కాకుండా సీబీఐతో విచారణ జరిపించాలని పిటిషనర్లు కోర్టును కోరారు. పిటిషనర్ల అభ్యంతరాలన్నీ పరిగణనలోకి తీసుకున్న న్యాయస్థానం విచారణ ముగించింది. మధ్యంతర పిటిషన్లలో ఏమైనా అభ్యంతరాలుంటే రేపు చెప్పాలంటూ పిటిషనర్ల తరఫు న్యాయవాదులను ఆదేశిస్తూ తీర్పును వాయిదా వేసింది.
Trending
- AP TET 2024 Results: మరికాసేపట్లో టెట్ ఫలితాలు వచ్చేస్తున్నాయ్..
- AP Mega DSC Notification: మరో 2 రోజుల్లోనే మెగా డీఎస్సీ నోటిఫికేషన్ వచ్చేస్తోంది.. జిల్లాల వారీ ఖాళీలు ఇవే!
- Tirumala: నాగుల చవితి సందర్భంగా రేపు పెద్ద శేష వాహనం సేవ.. దేవేరులతో కలిసి శ్రీవారు భక్తులకు దర్శనం..
- AP News: ట్రెండింగ్ చేస్తున్నారా? అయితే వీళ్లకు చిక్కితే అంతే సంగతులు..
- Running Train: రన్నింగ్ ట్రైన్ నుంచి కాలువలోకి దూకేసిన మహిళ.. ఆ తర్వాత ఏం జరిగిందంటే?
- సెక్యూరిటీ గార్డు డాక్టర్ అయ్యాడు! ఏకంగా రోగికి కట్టుకట్టి ఇంజెక్షన్ కూడా ఇచ్చాడు!
- చాప్టర్ 3: చెన్నైలో కొడాలి అరెస్ట్.. రజనీ కూతురు బిగ్ స్టెప్..
- Telangana Police: మళ్లీ మొదలైన లోన్ యాప్ ఆగడాలు.. పోలీసుల లేటెస్ట్ అలెర్ట్..!