బాలీవుడ్ స్టార్ హీరో రణబీర్ కపూర్, నేషనల్ క్రష్ రష్మిక మందన్నా జంటగా నటించిన ఈ సినిమాలో అనిల్ కపూర్, బాబీ డియోల్ కీలకపాత్రలు పోషించారు. డిసెంబర్ 1న విడుదలైన ఈ సినిమా మొదటి రోజే ప్రపంచవ్యాప్తంగా రూ.100 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టింది. ఇప్పటివరకు రణబీర్ కెరీర్ లోనే హయ్యేస్ట్ ఒపెనింగ్స్ సాధించిన చిత్రంగా యానిమల్ నిలిచింది. ఇక ఇందులో రణబీర్ నటనకు, సందీప్ మేకింగ్ పై ప్రశంసలు కురిపిస్తున్నారు.
ప్రస్తుతం పాన్ ఇండియా బాక్సాఫీస్ వద్ద సత్తా చాటుతోంది యానిమల్ సినిమా. విడుదలకు ముందే భారీ అంచనాలతో బజ్ క్రియేట్ చేసిన ఈ సినిమాకు అన్ని భాషల్లోనూ మంచి రెస్పాన్స్ వస్తుంది. అర్జున్ రెడ్డి, కబీర్ సింగ్ హిట్స్ తర్వాత దాదాపు ఐదేళ్లు గ్యాప్ తీసుకున్న డైరెక్టర్ సందీప్ యానిమల్ సినిమాను రూపొందించారు. బాలీవుడ్ స్టార్ హీరో రణబీర్ కపూర్, నేషనల్ క్రష్ రష్మిక మందన్నా జంటగా నటించిన ఈ సినిమాలో అనిల్ కపూర్, బాబీ డియోల్ కీలకపాత్రలు పోషించారు. డిసెంబర్ 1న విడుదలైన ఈ సినిమా మొదటి రోజే ప్రపంచవ్యాప్తంగా రూ.100 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టింది. ఇప్పటివరకు రణబీర్ కెరీర్ లోనే హయ్యేస్ట్ ఒపెనింగ్స్ సాధించిన చిత్రంగా యానిమల్ నిలిచింది. ఇక ఇందులో రణబీర్ నటనకు, సందీప్ మేకింగ్ పై ప్రశంసలు కురిపిస్తున్నారు.
అయితే ఇప్పుడు ఈ సినిమా ఓటీటీ స్ట్రీమింగ్ పార్టనర్ ఫిక్స్ అయినట్లుగా టాక్ వినిపిస్తుంది. ఈ సినిమా డిజిటల్ స్ట్రీమింగ్ హాక్కులను ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫాం నెట్ ఫ్లిక్స్ దక్కించుకుందని సమాచారం. బిగ్ స్క్రీన్ పై 6-8 వారాల తర్వాత ఈ మూవీ ఓటీటీలోకి రానుందట. అంటే వచ్చే ఏడాది రిపబ్లిక్ డే కానుకగా జనవరి 26న తెలుగు, హిందీ, తమిళం, కన్నడ, మలయాళం భాషలలో స్ట్రీమింగ్ కానుందని టాక్ వినిపిస్తుంది.
తండ్రి కొడుకుల మధ్య అనుబంధం, ఎమోషన్స్, యాక్షన్ సన్నివేశాలతో ప్రేక్షకులను కట్టిపడేశారు. ఇక ఈ సినిమాతో మరోసారి సందీప్ తన మార్క్ క్రియేట్ చేశాడు. సినిమా విడుదలకు ముందే పాన్ ఇండియా బాక్సాఫీస్ వద్ద హైప్ క్రియేట్ చేసిన ఈ మూవీ .. ఇప్పుడు అడియన్స్ అంచనలాకు మించి సక్సెస్ ఫుల్ గా దూసుకుపోతుంది. ఈ చిత్రాన్ని టీ సిరీస్ ఫిల్మ్స్, సినీ 1 స్టూడియోస్, భద్రకాళి పిక్చర్స్ బ్యానర్స్ పై భూషణ్ కుమార్, కృపన్ కుమార్ నిర్మించారు.