మొగల్తూరు జూలై 12 (ఆంధ్ర పత్రిక గోపరాజు సూర్య నారాయణరావు)
మొగల్తూరు మండలంలో పశువులు పెంచే రైతులకు సబ్సిడీపై సంపూర్ణ మిశ్రమ దాణ అందించబడుతోందని మొగల్తూరు మండల పశుసంవర్ధన శాఖ డాక్టర్ గొట్టుముక్కల నీలిమ అన్నారు. బుధవారం తమ కార్యాలయంలో ఆమె మా” ఆంధ్ర పత్రిక ప్రతినిధి”తో మాట్లాడారు. ప్రస్తుతము 200 కేజీలు దాణ రూ 3,160/-లు మార్కెట్ రేటు ఉండగా ప్రభుత్వము 200 కేజీలు దాణ కేవలం రూ1300/-లుకూ సబ్సిడీపై పశువులు పెంచే రైతు యజమానులకు అందించబడుతుందని ఆమె తెలిపారు. అలాగే మొగల్తూరు మండలంలో రైతు భరోసా కేంద్రాల ద్వారా రైతులకు గడ్డి విత్తనములు మరియు జొన్న విత్తనములు సబ్సిడీపై పంపిణీ చేయబడుతుందని ఆమె తెలిపారు. గడ్డి విత్తనాలు జొన్న విత్తనాలు 75% సబ్సిడీపై పశువులు పెంచే రైతు యాజమాన్యులకు అందించబడుతోందని సద్వినియోగపరుచుకొనవలసినదిగా ఆమె కోరారు. మొగల్తూరు మండలంలో స్టాక్ పాయింట్ మండల పశువైద్యశాల యందు నిలవ ఉంచబడుతుందని అయితే సరఫరా మాత్రం రైతులకు సమీపంలో గల రైతు భరోసా కేంద్రాల ద్వారా పంపిణీ చేయబడుతుందని నీలిమ తెలిపారు.