జనసేన అధినేత పవన్ కళ్యాణ్ వాలంటీర్లను ఉద్దేశిస్తూ చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారాన్ని రేపిన విషయం తెలిసిందే. పవన్ చేసిన వ్యాఖ్యలపై వైసీపీ నాయకులు ఓ రేంజ్లో ఫైర్ అవుతున్నారు. అంతేకాకుండా రాష్ట్రంలో ఉన్న వాలంటీర్లు సైతం నిరసనలకు దిగారు. పవన్ వెంటనే క్షమాపణ చెప్పాలంటూ నిరసనలు చేపట్టారు…
జనసేన అధినేత పవన్ కళ్యాణ్ వాలంటీర్లను ఉద్దేశిస్తూ చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారాన్ని రేపిన విషయం తెలిసిందే. పవన్ చేసిన వ్యాఖ్యలపై వైసీపీ నాయకులు ఓ రేంజ్లో ఫైర్ అవుతున్నారు. అంతేకాకుండా రాష్ట్రంలో ఉన్న వాలంటీర్లు సైతం నిరసనలకు దిగారు. పవన్ వెంటనే క్షమాపణ చెప్పాలంటూ నిరసనలు చేపట్టారు. ఈ క్రమంలోనే తాజాగా ఆంధ్రప్రదేశ్ మహిళా కమిషన్ సైతం పవన్ చేసిన వ్యాఖ్యలపై రియాక్ట్ అయ్యింది.
పవన్ కళ్యాణ్‌కు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మహిళా కమిషన్ నోటీసులిచ్చింది. రాష్ట్రంలో మహిళలు కనిపించకుండా పోతున్నారన్ని వాఖ్యలపై వివరణ ఇవ్వాలని నోటీసులో పేర్కొన్నారు. ఒకవేళ పది రోజుల్లో వివరణ ఇవ్వకపోతే క్షమాపణలు చెప్పాలని తెలిపారు. మహిళల మిస్సింగ్‌పై మహిళల మిస్సింగ్‌పై ఆధారాలు ఇవ్వాలలన్నారు. పవన్ చేసిన వ్యాఖ్యలు మహిళల భద్రతకు భంగం కలిగేలా ఉన్నాయని ఏపీ మిహిళా కమిషన్ అభిప్రాయపడింది. మరి మహిళా కమిషన్ ఇచ్చిన నోటీసులపై పవన్ ఎలా స్పందిస్తారో చూడాలి.