మనస్పర్థల వల్ల దూరంగా ఉండిపోయిన దంపతులను కలిపే ప్రయత్నంలో పెద్దలుగా వచ్చిన ఇద్దరు మహిళలతో సహా.. పుట్టింటికి వెళ్లిపోయిన భార్యను నచ్చజెప్పి వెంట తీసుకెళ్లడానికి వచ్చిన వ్యక్తి ప్రమాదంలో చనిపోవడంతో విషాదం నెలకొంది. నంద్యాల మండలం మిట్నాలకు చెందిన బంగార్రాజుకు బిళ్లలాపురానికి చెందిన సువార్తమ్మతో పెళ్లైంది. వారికి ఓ కూతురు కూడా ఉంది. అయితే కొద్ది నెలల క్రితం వీరు మనస్పర్థలతో విడిపోయారు.
ఏపీలోని నంద్యాల – గిద్దలూరు ప్రదాన రహాదారిలో ఆదివారం రాత్రి జరిగిన ప్రమాదంలో ముగ్గరు మృతి చెందడం కలకలం రేపింది. మరో ఇద్దరికి తీవ్రంగా గాయాలయ్యాయి. ఇక వివరాల్లోకి వెళ్తే.. నంద్యాల మండలం మిట్నాలకు చెందిన బంగార్రాజు (27), అతని బంధువులు గోస్పాడు మండలం యూళ్లూరుకు చెందిన సుబ్బమ్మ(40) , పరదేశి లక్ష్మీ(30), మరో ఇద్దరు ఆదివారం ఉదయం సొంత పని మీద బిళ్లలాపూరానికి వెళ్లారు. అయితే పని ముగించుకొని రాత్రికి తిరిగివస్తున్న సమయంలో బోయిలకుంట్ల మెట్ల వద్ద.. చేపల లోడుతో వెళ్తున్నటువంటి ఓ బొలేరో వాహనం వేగంగా ఢీకొంది. అయితే ఈ దుర్ఘటనలో బంగార్రాజు, సుబ్బమ్మ, లక్ష్మీ అక్కడిక్కడే ప్రాణాలు కోల్పోయారు. దీంతో సమాచారం తెలుసుకున్న మహనంది పోలీసులు ఘటనాస్థలానికి చేరుకొని వివరాలు సేకరించారు.
మృతదేహాన్ని పోస్టు మార్టం కోసం నంద్యాల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అయితే బోలేరో వాహనం డ్రైవర్ ప్రస్తుతం పరారీలో ఉన్నట్లు పోలీసులు తెలిపారు. అలాగే నిత్యం వాహనాల రద్దీ ఉండే ప్రాంతంలో ప్రమాదాల నివారణకు అధికారులు, స్పీడ్ బ్రేకర్లు, ప్రమాద హెచ్చరిక బోర్టులు ఏర్పాటు చేయకపోవడం వల్లే.. ఈ రోడ్డు ప్రమాదం జరిగినట్లు మృతుల కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. గతంలో కూడా ఇలాంటి ప్రమదాలు జరిగినప్పటికీ అధికారులు చర్యలు తీసుకోవడం లేదని స్థానికులు ఆరోపిస్తున్నారు. ఇదిలా ఉండగా.. మనస్పర్థల వల్ల దూరంగా ఉండిపోయిన దంపతులను కలిపే ప్రయత్నంలో పెద్దలుగా వచ్చిన ఇద్దరు మహిళలతో సహా.. పుట్టింటికి వెళ్లిపోయిన భార్యను నచ్చజెప్పి వెంట తీసుకెళ్లడానికి వచ్చిన వ్యక్తి ప్రమాదంలో చనిపోవడంతో విషాదంనెలకొంది. నంద్యాల మండలం మిట్నాలకు చెందిన బంగార్రాజుకు బిళ్లలాపురానికి చెందిన సువార్తమ్మతో పెళ్లైంది. వారికి ఓ కూతురు కూడా ఉంది.
అయితే కొద్ది నెలల క్రితం వీరు మనస్పర్థలతో విడిపోయారు. ఇక సువార్తమ్మ తన పుట్టింటికి వెళ్లడంతో.. తన కుటుంబ సభ్యులకు నచ్చజెప్పి తీసుకెళ్లడానికి ఆదివారం రోజు బంగార్రాజు.. తన దగ్గరి బంధువులైన యాళ్లూరుకు చెందిన సుబ్బమ్మ, లక్ష్మీతో సహా.. అతని తల్లి మార్తమ్మ, మరో బాలుడు అమర్‌ను వెంట తీసుకెళ్లాడు. ఇరు కుటుంబాల పెద్దలు కూడా మాట్లాడుకుని సువార్తమ్మను అత్తవారింటికి పంపించేలా ఒప్పించారు. సోమవారం ఒడిబియ్యం పోసి పంపిస్తామని చెప్పడం వల్ల… ఆ ఇంటికి వచ్చిన ఐదురుగు ఆటోలో తిరుగు ప్రయాణమయ్యారు.బిళ్లపురం నుంచి 3 కిలోమీటర్ల దూరంలో బోయిలకుంట్ల వద్ద బొలేరో వాహన ఢీకొంది. దీంతో బంగ్రారాజు, సుబ్బమ్మ, లక్ష్మి అక్కడికక్కడే దుర్మరణం చెందగా, మార్తమ్మ, అమర్ తీవ్రంగా గాయాలపాలయ్యారు. ఇక విషయం తెలుసుకున్న బంధువులు ఘటనాస్థలానికి చేరుకుని కన్నీరుమున్నీరవుతున్నారు.