64 కళలలో చోర విద్యకూడా ఓ కళ అంటారు. అది ఎంతవరకు కరెక్టో తెలియదు గానీ దొంగతనం చేయడమంటే అoత మామూలు విషయం అయితే మాత్రం కాదు. రాత్రి పూట తాళాలు వేసి ఉన్న ఇళ్లను టార్గెట్ చేసుకొని చోరీ చేయటం అంటే ఎంతో అనుభవం ఉండాలి. ఇలా ఎవరూ లేని ఇంట్లో చోరీ చేసి బయటపడటం ఒక ఎత్తయితే..ఇంట్లో మనుషులు నిద్రిస్తుండగానే ఇంట్లోకి చొరబడి దొంగతనం చేసి ఎవరికి చిక్కకుండా బయటపడటం అనేది మరో ఎత్తు.
64 కళలలో చోర విద్యకూడా ఓ కళ అంటారు. అది ఎంతవరకు కరెక్టో తెలియదు గానీ దొంగతనం చేయడమంటే అoత మామూలు విషయం అయితే మాత్రం కాదు. రాత్రి పూట తాళాలు వేసి ఉన్న ఇళ్లను టార్గెట్ చేసుకొని చోరీ చేయటం అంటే ఎంతో అనుభవం ఉండాలి. ఇలా ఎవరూ లేని ఇంట్లో చోరీ చేసి బయటపడటం ఒక ఎత్తయితే.. ఇంట్లో మనుషులు నిద్రిస్తుండగానే ఇంట్లోకి చొరబడి దొంగతనం చేసి ఎవరికి చిక్కకుండా బయటపడటం అనేది మరో ఎత్తు. ఇలాంటి ఘటనే శ్రీకాకుళం జిల్లాలో చోటు చేసుకుంది. అయితే ఇందులో ట్విస్ట్ ఏమిటంటే.. చోరికి ఇంట్లోకి ప్రవేశించిన దొంగ చివరకి ఇంటి యజమానికి చిక్కిపోయాడు. శ్రీకాకుళం జిల్లా పలాస మునిసిపాలిటి పరిధిలోని ఎల్లమ్మ వీధిలో మంగళవారం అర్థరాత్రి ఈ ఘటన చోటు చేసుకుంది.
పలాస లోని ఎల్లమ్మ వీధిలో బుల్లు పాడి అనే వ్యక్తి ఇంట్లోకి అర్ధరాత్రి ఒంటి గంట సమయంలో దొంగ ప్రవేశించాడు. ఇంటి తాళాలు తీసి లోపలకి వెళ్లి ఇంట్లోని బీరువా తెరిచేందుకు ప్రయత్నం చేస్తున్న క్రమంలో శబ్దానికి పక్క గదిలోనే నిద్రిస్తున్న ఇంటి యజమానికి మెళుకువ వచ్చింది. నెమ్మదిగా లేచి చప్పుడు వచ్చిన గదిలోకి తొంగి చూడగా….గదిలో దొంగోడి అలికిడి కనిపించింది. వెంటనే షాక్ కి గురైన ఇంటి యజమాని నెమ్మదిగా వెళ్లి దొంగోడు ఉన్న గదికి తలుపు వేసి బయట నుండి గెడ వేసేసాడు. ఇరుగు పొరుగు వారిని పిలిచి తలుపు తెరిచి దొంగోడిని పట్టుకున్నారు. వాడికి దేహశుద్ది చేసి పోలీసులకు అప్పజెప్పారు.
ఆరు నెలల కిందట ఇదే ఇంట్లో చోరీ చేసిన దొంగ..
ఈ చోరీలో ట్విస్ట్ ల మీద ట్విస్ట్ లు ఉన్నాయి. ఇంట్లో మనుషులు నిద్రిస్తుండగానే చోరికి యత్నించి దొరికి పోవటం ఒక ట్విస్ట్ అయితే సరిగ్గా ఆరు నెలల కిందట ఇదే ఇంట్లో చోరీకి పాల్పడటం మరో ట్విస్ట్. అప్పుడయితే చోరీ చేసి ఎవరికి పట్టుబడకుండా బయట పడినప్పటికీ ఈసారి మాత్రం నేరుగా ఇంటి యజమానికే చిక్కిపోయాడు. గేట్ వద్ద ఉన్న సీసీ కెమెరా లోని అప్పటి ఫీడ్ పరిశీలించి చూడగా గేట్ నుండి లోపలకు వెళ్తూ దొంగ కనిపించాడు.
పగలు కార్పెంటర్.. రాత్రయితే దొంగ..
పట్టుబడిన దొంగ పలాసకి చెందిన వాడేనని పోలిసుల విచారణలో తేలింది. పేరు మని అని వృత్తి పరంగా కార్పెంటర్ పని చేస్తూ రాత్రి పూట ఇలా చోరీలకు పాల్పడటం ఇతగాడి హాబీ. మొత్తానికి పాపం పండి ఇన్నాళ్లకు కటకటాల పాలయ్యాడు మని.