ఏసీబీ కోర్టులో చంద్రబాబుకు చుక్కెదురైంది. ఆయన తరఫున రిమాండ్ రిజెక్ట్ చేయాలంటూ న్యాయవాదులు వేసిన హౌస్ మోషన్ పిటిషన్ను కోర్టు తిరస్కరించింది. రిమాండ్ రిపోర్ట్ సమర్పించిన తరువాతే హౌస్ మోషన్ పిటిషన్ దాఖలు చేయాలని సూచించింది. ఇదిలాఉంటే ఏసీబీ కోర్టు జడ్జి ఇంటి ముందు ఉద్రిక్తల నెలకొంది. న్యాయవాదులు జడ్జి ఇంటి ముందు ఉండటంపై అభ్యంతరం వ్యక్తం చేశారు పోలీసులు. దాంతో పోలీసులతో వాగ్వాదానికి దిగారు న్యాయవాదులు.
Chandrababu Arrest: ఏసీబీ కోర్టులో చంద్రబాబుకు చుక్కెదురైంది. ఆయన తరఫున రిమాండ్ రిజెక్ట్ చేయాలంటూ న్యాయవాదులు వేసిన హౌస్ మోషన్ పిటిషన్ను కోర్టు తిరస్కరించింది. రిమాండ్ రిపోర్ట్ సమర్పించిన తరువాతే హౌస్ మోషన్ పిటిషన్ దాఖలు చేయాలని సూచించింది. ఇదిలాఉంటే ఏసీబీ కోర్టు జడ్జి ఇంటి ముందు ఉద్రిక్తల నెలకొంది. న్యాయవాదులు జడ్జి ఇంటి ముందు ఉండటంపై అభ్యంతరం వ్యక్తం చేశారు పోలీసులు. దాంతో పోలీసులతో వాగ్వాదానికి దిగారు న్యాయవాదులు.
మరోవైపు సిట్ కార్యాలయంలో చంద్రబాబు విచారణ కొనసాగుతోంది. దాదాపు 7 గంటలుగా విచారణ కొనసాగుతోంది. ఇక చంద్రబాబు విచారణ నేపథ్యంలో నారా లోకేష్, బాలకృష్ణ సిట్ కార్యాలయంలోనే ఉన్నారు. మొత్తంగా పరిస్థితి ఉద్రిక్తంగా మారుతోంది.