Police Notice to Pawan Kalyan: పవన్ కల్యాణ్ వారాహి యాత్రకు ముందే పెడనలో రాజకీయం ఒక్కసారిగా వేడెక్కింది. పవన్ కల్యాణ్‌కు కృష్ణా జిల్లా పోలీసుల నోటీసులు జారీ చేశారు. వారాహి యాత్రపై రాళ్ల దాడికి ప్లాన్ చేశారంటూ పవన్ చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా పరిగణించారు పోలీసులు. ఆరోపణలకు సాక్ష్యాలు చూపించాలంటూ…
Pawan Kalyan: పవన్ కల్యాణ్ వారాహి యాత్రకు ముందే పెడనలో రాజకీయం ఒక్కసారిగా వేడెక్కింది. పవన్ కల్యాణ్‌కు కృష్ణా జిల్లా పోలీసుల నోటీసులు జారీ చేశారు. వారాహి యాత్రపై రాళ్ల దాడికి ప్లాన్ చేశారంటూ పవన్ చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా పరిగణించారు పోలీసులు. ఆరోపణలకు సాక్ష్యాలు చూపించాలంటూ పవన్‌కు నోటీసులు జారీ చేశారు పోలీసులు. మంగళవారం నాడు మీడియాతో మాట్లాడిన పవన్ కల్యాణ్.. వారాహి యాత్ర సందర్భంగా పెడనలో అల్లర్లకు వైసీపీ కుట్ర చేస్తోందంటూ ఆరోపించారు. ఈ ఆరోపణలకు వైసీపీ నేత, మంత్రి జోగి రమేష్ స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. పవన్ వ్యాఖ్యలపై ఫైర్ అయ్యారాయన. అల్లర్లు జరుగుతాయని ఆందోళన వ్యక్తం చేసిన పవన్..
తనతో వస్తే దగ్గరుండి తీసుకెళ్తానని అన్నారు. ఇలా వైసీపీ, జనసేన నేతల మధ్య మాటల యుద్ధం నెలకొంది. మరోవైపు రెండు పార్టీల డైలాగ్ వార్తో పోలీసులు అప్రమత్తం అయ్యారు. 350 మంది పోలీసులతో భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. పెడనలోని మంత్రి జోగి రమేష్ ఆఫీస్, నివాసం దగ్గర కూడా పష్టిమైన భద్రతను ఏర్పాటు చేశారు. పెడనలో ఇవాళ మధ్యాహ్నం నుంచే ట్రాఫింక్ ఆంక్షలు విధించారు.