అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ కేసులో తాజాగా మరో సంస్థ పేరును చేర్చింది సీఐడీ. ఈ కేసులో చంద్రబాబు కుటుంబానికి సంబంధించిన హెరిటేజ్ ఫుడ్స్‌ను ఏ–6 గా చేర్చింది సీఐడీ. చంద్రబాబు సీఎంగా ఉన్న కాలంలో హెరిటేజ్ ఫుడ్స్ కు అనేక ప్రయోజనాలు కలిగించారని.. ముఖ్యంగా ఇన్నర్ రింగ్ రోడ్..
అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ కేసులో తాజాగా మరో సంస్థ పేరును చేర్చింది సీఐడీ. ఈ కేసులో చంద్రబాబు కుటుంబానికి సంబంధించిన హెరిటేజ్ ఫుడ్స్‌ను ఏ–6 గా చేర్చింది సీఐడీ. చంద్రబాబు సీఎంగా ఉన్న కాలంలో హెరిటేజ్ ఫుడ్స్ కు అనేక ప్రయోజనాలు కలిగించారని.. ముఖ్యంగా ఇన్నర్ రింగ్ రోడ్ అలైన్ మెంట్ మార్చడం ద్వారా హెరిటేజ్ ఫుడ్స్ కు ప్రయోజనం కల్పించారని వాదించింది సీఐడీ. దీంతో ఇన్నర్‌రింగ్ రోడ్ కేస్‌లో లింగమనేని, హేరిటేజ్ మధ్య ఉన్న భూముల లింకులపై.. భువనేశ్వరి నుండి జరిగిన ట్రాన్సక్షన్స్ అనుమానాస్పదగంగా ఉన్నాయనే దానిపై వాదనలు జరిగాయి.
129 ఆధారాలను గుర్తించినట్లు చెబుతున్న సీఐడీ..
ఇక ఇన్నర్ రింగ్ రోడ్ స్కామ్ లో చంద్రబాబు, నారా లోకేష్ తో పాటు భువనేశ్వరి పేరును సీఐడీ చేర్చిందనే టాక్ వినిపిస్తుంది. ఇక ఈ కేసులో ఏ- 1 గా ఉన్న చంద్రబాబు నాయుడి సతీమణి నారా భువనేశ్వరి హెరిటేజ్ ఫుడ్స్ కు వైస్ చైర్ పర్సన్, ఎండీగా ఉండగా.. ఏ -14 గా ఉన్న లోకేష్ భార్య బ్రాహ్మణి ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్‌గా ఉన్నారు. 56 శాతానికిపైగా షేర్లు ఉండటంతో ఆ సంస్థ డైరెక్టర్ల బోర్డు అంతా ఆ కుటుంబం ఆధిపత్యంలోనే ఉందని చెబుతున్నారు. ఈ కేసులో సిట్ అధికారులు కీలకమైన 129 ఆధారాలను గుర్తించినట్లుగా కూడా సీఐడీ చెబుతోంది. పక్కా ప్లాన్ తోనే ఇన్నర్ రింగ్ రోడ్డు అలైన్మెంట్లో మార్పులు చేశారనీ, హెరిటేజ్ సంస్థకు, లింగమనేని రమేష్ కుటుంబానికి అడ్డగోలుగా లబ్ది చేకూర్చారనీ సీఐడీ అధికారులు గట్టిగా వాదిస్తున్నారు.
టీమ్‌గా ఏర్పడి దోచుకున్నారు..
అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్ స్కామ్‌లో చంద్రబాబు కుటుంబమంతా టీమ్ వర్క్‌గా దోపిడీలో భాగస్వామ్యం అయ్యిందని ఆంధ్రప్రదేశ్ పర్యాటక శాఖ మంత్రి రోజా ఆరోపించారు. చంద్రబాబు చేసిన పాపాలకు ఆయన సతీమణి నారా భువనేశ్వరి కూడా శిక్ష అనుభవించక తప్పదంటూ కీలక వ్యాఖ్యలు చేశారు మంత్రి రోజా. అమరావతిలో రోడ్డు వేయకుండానే అలైన్మెంట్ పేరుతో దోచుకున్నారని విమర్శించారు మంత్రి రోజా. అలాగే రిటర్న్ గిఫ్ట్ ఇస్తానంటూ లోకేష్ చేసిన కామెంట్స్‌కు స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు రోజా.. లోకేష్ అలా అంటుంటే నవ్వొస్తుందన్నారు. ఢిల్లీకి పారిపోయి ఏపీకి రిటర్న్ రావడానికి భయపడుతున్న లోకేష్.. ఏం రిటర్న్ గిఫ్ట్ ఇస్తారని సెటైర్లు వేశారు మంత్రి రోజా.