మాదకద్రవ్యాల వినియోగంపై కఠిన చర్యలు
అధికారులను ఆదేశించిన సిఎం జగన్
అమరావతి,డిసెంబర్ 19 (ఆంధ్రపత్రిక) : ఎపిని నార్కొటిక్స్ రహిత రాష్ట్రంగా మార్చాలని ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి అధికారులను ఆదేశించారు. రాష్ట్రంలో ఎక్కడా మాదకద్రవ్యాల వినియోగం ఉండకూడదన్నారు.ఎస్‌ఈబీ, ఆబ్కారీ శాఖపై ముఖ్యమంత్రి జగన్ సవిూక్ష నిర్వహించారు. డ్రగ్స్ రహిత రాష్ట్రం కోసం పోలీసు, ఆబ్కారీ శాఖ కలిసి పని చేయాలని అధికారులకు సూచించారు. నార్కొటిక్స్‌కు వ్యతిరేకంగా కళాశాలలు, విశ్వవిద్యాలయాల్లో భారీ హౌర్డింగ్స్ పెట్టాలన్నారు. ఎస్‌ఈబీ టోల్‌ఫ్రీ నెంబర్‌ను బాగా ప్రచారం చేయాలని కోరారు. అక్రమ మద్యాన్ని అరికట్టాలని, గంజాయి సాగు జరగకుండా పటిష్ఠ చర్యలు చేపట్టాలని ఆదేశించారు. దిశ చట్టం, యాప్ ఇంకా సమర్థంగా అమలు కావాల్సిన ఆవశ్యకతను సీఎం గుర్తుచేశారు. నార్కొటిక్స్ రహిత రాష్ట్రంగా మారాలని ఆదేశించారు. ఎక్కడా మాదక ద్రవ్యాలు వినియోగం ఉండొద్దు.. ఆ లక్ష్యంతోనే పని చేయాలంటూ పోలీస్, ఎక్సైజ్ శాఖలు కలిసి పని చేయాలంటూ ఆయన సూచించారు. ఈ సందర్భంగా సంబంధిత శాఖల నుంచి వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఎస్‌ఈబీ సవిూక్ష సందర్భంగా.. నార్కొటిక్స్‌తో పాటు అక్రమ మద్యాన్ని పూర్తిగా అరికట్టడం, మరింత సమన్వయంతో సచివాలయాల్లోని మహిళా పోలీస్‌ల పనితీరును మెరుగుపర్చడం, దిశ చట్టం.. యాప్‌లను మరింత పక్కాగా అమలు చేసేలా చూడడం.. ఈ నాలుగింటిపై పోలీస్ శాఖ ప్రత్యేక దృష్టి పెట్టాలని సీఎం జగన్ ఆదేశించారు. ప్రతి కాలేజీ, ప్రతి వర్సిటీలో భారీ హోర్డింగ్స్ పెట్టాలన్నారు. ఎస్‌ఈబీ టోల్‌ఫ్రీ నెంబర్‌ను బాగా ప్రచారం చేయాలన్నారు. నార్కొటిక్స్‌పై పూర్తి అవగాహన కల్పించాలని అధికారులకు ఆదేశించారు. రెండు శాఖలు కలిసి వారంలో ఒకరోజు తప్పనిసరిగా సమావేశం కావాలన్నారు. ఇక నుంచి రెగ్యులర్‌గా ఈ కార్యక్రమాలు జరగాలని దిశా నిర్దేశర చేశారు. అక్రమ మద్యాన్ని పూర్తిగా అరికట్టాలన్నారు. ఎక్కడా గంజాయి సాగు జరగకుండా చూడాలన్నారు. వారికి ప్రత్యామ్నాయ ఉపాధి మార్గాలు చూపాలని.. సచివాలయాల మహిళా పోలీస్‌లనూ సమన్వయం చేయాలన్నారు. వారిని ఇంకా సమర్థంగా వినియోగించు కోవాలన్నారు. మరింత సమన్వయంతో సచివాలయాల్లోని మహిళా పోలీస్‌ల పనితీరును మెరుగుపర్చడం, దిశ చట్టం యాప్‌లను మరింత పక్కాగా అమలు చేసేలా చూడాని, ఈ నాలుగింటిపై పోలీస్ శాఖ ప్రత్యేక దృష్టి పెట్టాలని సీఎం జగన్ ఆదేశించారు.