టీడీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, మాజీ మంత్రి లోకేష్‌పై నమోదైన కేసుల్లో ఇవాళ కీలక అప్డేట్స్ ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో పలు కేసులపై విచారణ జరుగనుంది. ముఖ్యంగా హైకోర్టులో ఆయా కేసులపై వాదనలు కొనసాగనున్నాయి. గురువారం నాడు హైకోర్టు ముందుకు చంద్రబాబు బెయిల్ పిటిషన్ రానుంది. స్కిల్ కేసులో ఏసీబీ కోర్టు తీర్పును సవాల్ చేశారు చంద్రబాబు.
టీడీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, మాజీ మంత్రి లోకేష్‌పై నమోదైన కేసుల్లో ఇవాళ కీలక అప్డేట్స్ ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో పలు కేసులపై విచారణ జరుగనుంది. ముఖ్యంగా హైకోర్టులో ఆయా కేసులపై వాదనలు కొనసాగనున్నాయి. గురువారం నాడు హైకోర్టు ముందుకు చంద్రబాబు బెయిల్ పిటిషన్ రానుంది. స్కిల్ కేసులో ఏసీబీ కోర్టు తీర్పును సవాల్ చేశారు చంద్రబాబు. ఈ పిటిషన్‌పైనా విచారణ జరుగనుంది. ఇక రెగ్యులర్ బెయిల్ పిటిషన్‌పైన కూడా హైకోర్టులో ఇవాళ విచారణ జరుగనుంది. ఈ పిటిషన్లన్నింటినీ ఎలా విచారిస్తుందనేది ధర్మాసనం నిర్ణయం ప్రకారం ఉండనుంది.
ఇక అంగళ్లు కేసులోనూ ఇవాళ హైకోర్టులో విచారణ జరుగనుంది. చంద్రబాబు ముందస్తు బెయిల్ పిటిషన్‌పై వాదనలు వినిపించనున్నారు చంద్రబాబు తరఫు న్యాయవాది. ఈ కేసులో గురువారం వరకు చంద్రబాబును అరెస్ట్ చేయొద్దంటూ హైకోర్టు ఇచ్చిన గడువు నేటితో ముగియనుంది. ఈ నేపథ్యంలో.. ఈ కేసు మళ్లీ విచారణకు వస్తుంది. అయితే, అంగళ్లు కేసులో ప్రభుత్వం వైపు నుంచి మెమో, పీటీ వారెంట్ వేయలేదని హైకోర్టుకు తెలిపింది ప్రభుత్వం. కాగా, అంగళ్లు కేసులో ఇవాళ ఆర్డర్స్ ఇస్తామని హైకోర్టు తెలిపింది.
లోకేష్ బెయిల్ పిటిషన్‌పై హైకోర్టులో విచారణ..
స్కిల్ డెవలప్మెంట్ కేసులో నారా లోకేష్ దాఖలు చేసిన బెయిల్ పిటిషన్‌పైనా హైకోర్టులో ఇవాళ విచారణ జరుగనుంది. గతంలో ఈ కేసుపై విచారించిన హైకోర్టు ధర్మాసనం.. గురువారం వరకు లోకేష్‌ను అరెస్ట్ చేయొద్దంటూ తీర్పునిచ్చింది హైకోర్టు. దాంతో ఈ కేసు ఈ రోజు మళ్లీ విచారణకు రానుంది. స్కిల్ స్కామ్ కేసులో నారా లోకేష్‌ను కూడా నిందితుడిగా చేర్చింది సీఐడీ.
చంద్రబాబుకు హైకోర్టులో ఊరట..
అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్, అంగళ్లు కేసుల్లో టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబుకు హైకోర్టులో ఊరట లభించింది. అంగళ్లు కేసులో గురువారం వరకు, ఇన్నర్ రింగ్ రోడ్డు కేసులోనూ 16వ తేదీ వరకు అరెస్టు చేయొద్దని హైకోర్ట్ ఆదేశాలు ఇచ్చింది. ఈ మేరకు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది ధర్మాసనం. అలాగే, కాల్ డేటా పిటిషన్‌పై తమ వాదనలు వినాలని చంద్రబాబు తరఫు లాయర్లు కోర్టును కోరగా.. గురువారం మధ్యాహ్నం వాదనలు వినేందుకు ఏసీబీ కోర్టు అంగీకరించింది. హైకోర్టు ఆదేశాలతో ఇన్నర్‌రింగ్‌రోడ్డు కేసులో పీటీ వారెంట్‌పై ఏసీబీ కోర్టులో విచారణ వాయిదా పడింది.