మహిళల చదువులకు ఊతమిచ్చే కళ్యాణమస్తు, వైఎస్సార్ షాదీ తోఫా పథకాలను తీసుకొచ్చారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, దివ్యాంగులు, భవన నిర్మాణ కార్మికుల కుటుంబాలకు ఏపీ ప్రభుత్వం ఆర్థిక సాయం అందిస్తున్న విషయం తెలిసిందే. ఈ పథకం పొందాలంటే వధూవరులిద్దరు 10వ తరగతి ఉత్తీర్ణత సాధించాలనే నిబంధనను తప్పనిసరిగా అమలు చేస్తున్నారు. దీంతో నిరక్ష్యరాస్యతను, బాల్య వివాహాలకు…
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం శుభవార్త తెలిపింది. వైఎస్సార్ కళ్యాణమస్తు, వైఎస్సార్ షాదీ తోఫా నిధులను గురువారం (ఈరోజు) విడుదల చేయనున్నారు. ఆడబిడ్డల వివాహాలు తల్లిదండ్రులకు ఆర్థిక భారం కాకూదనే లక్ష్యంతో తీసుకొచ్చిన ఈ పథకంలో భాగంగా అర్హులైన వారికి నేడు ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి ఆర్థిక సాయం అందించనున్నారు.
జూలై- అక్టోబర్,2023 లో వివాహం చేసుకున్న అర్హులైన 10,511 జంటలకు 81.64 కోట్ల ఆర్థిక సాయాన్ని సీఎం జగన్ మోహన్ రెడ్డి విడుదల చేయనున్నారు. ఉదయం 11 గంటలకు క్యాంప్ కార్యాలయం నుంచి బటన్ నొక్కి వధువుల తల్లుల ఖాతాల్లోకి డబ్బులను జమ చేయనున్నారు. ఇదిలా ఉంటే వైఎస్సార్ కళ్యాణమస్తు, వైఎస్సార్ షాదీ తోఫా కింద ఇప్పటి వరకు 46,062 మంది లబ్ధిదారుల ఖాతాల్లో 348.84 కోట్లు జమ చేసింది ఏపీ ప్రభుత్వం.
మహిళల చదువులకు ఊతమిచ్చే కళ్యాణమస్తు, వైఎస్సార్ షాదీ తోఫా పథకాలను తీసుకొచ్చారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, దివ్యాంగులు, భవన నిర్మాణ కార్మికుల కుటుంబాలకు ఏపీ ప్రభుత్వం ఆర్థిక సాయం అందిస్తున్న విషయం తెలిసిందే. ఈ పథకం పొందాలంటే వధూవరులిద్దరు 10వ తరగతి ఉత్తీర్ణత సాధించాలనే నిబంధనను తప్పనిసరిగా అమలు చేస్తున్నారు. దీంతో నిరక్ష్యరాస్యతను, బాల్య వివాహాలకు సైతం అడ్డుకట్ట వేయొచ్చనేది ప్రభుత్వ ఉద్దేశం. ఇందులో భాగంగానే.. పెళ్లి నాటికి అమ్మాయికి 18, అబ్బాయికి 21 సంవత్సరాలు దాటి ఉండాలన్న నిబంధన పెట్టారు.
ఈ పథకంలో భాగంగా ఎస్సీలకు ప్రభుత్వం రూ. లక్ష సాయంగా అందిస్తోంది. అలాగే.. కులాంతర వివాహం చేసుకున్న ఎస్సీలకు రూ.1,20,000 సాయం చేస్తోంది. ఇక బీసీలకు రూ. 50,000, కులాంతర వివాహం చేసుకున్న బీసీలకు రూ.75,000 అందిస్తున్నారు. మైనార్టీలు, దూదేకులు, నూర్ బాషాలకు రూ.1,00,000 ఆర్థిక సాయంగా అందిస్తోన్న విషయం తెలిసిందే.