వినాయకుడి నిమజ్జనాలు మొదలయ్యాయి. చాలా మంది భక్తులు గణపయ్యను మూడు రోజుల తరువాత గంగమ్మ ఒడికి చేరుస్తున్నారు. బొజ్జ గణపయ్యకు ఎంత ఘనంగా స్వాగతం పలికారో.. అంతే ఘనంగా వీడ్కోలు కూడా పలుకుతున్నారు. ఆట పాటలు కోలాటలతో సంతోసంగా స్వామిని గంగమ్మ ఒడికి చేరుస్తున్నారు. అయితే, విశాఖలో వినాయక నిమజ్జనం సందర్భంగా ఊహించని ఘటన చోటు చేసుకుంది. సముద్ర తీరంలో వినాయక విగ్రహాలను నిమజ్జనం చేస్తుండగా.. ఒక్కసారిగా భారీ చేప తీరానికి వచ్చింది.
వినాయకుడి నిమజ్జనాలు మొదలయ్యాయి. చాలా మంది భక్తులు గణపయ్యను మూడు రోజుల తరువాత గంగమ్మ ఒడికి చేరుస్తున్నారు. బొజ్జ గణపయ్యకు ఎంత ఘనంగా స్వాగతం పలికారో.. అంతే ఘనంగా వీడ్కోలు కూడా పలుకుతున్నారు. ఆట పాటలు కోలాటలతో సంతోసంగా స్వామిని గంగమ్మ ఒడికి చేరుస్తున్నారు. అయితే, విశాఖలో వినాయక నిమజ్జనం సందర్భంగా ఊహించని ఘటన చోటు చేసుకుంది. సముద్ర తీరంలో వినాయక విగ్రహాలను నిమజ్జనం చేస్తుండగా.. ఒక్కసారిగా భారీ చేప తీరానికి వచ్చింది. భక్తులపై దాడికి పాల్పడింది. చేప దాడిలో దాదాపు 14 మంది భక్తులు తీవ్రంగా గాయపడ్డారు. ఏం జరుగుతుందో తెలియని పరిస్థితుల్లో భక్తులు చెల్లా చెదురుగా పరుగులు తీశారు. ఈ ఘటనకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి.
తిరుపతి జిల్లా గూడూరు పరిసర ప్రాంతాల్లో వినాయక చవితి వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. వాడవాడలా గణేష్ మండపాలను ఏర్పాటు చేసిన వినాయక ఉత్సవ కమిటీలు మూడు, నాలుగు, ఐదో రోజుల్లో నిమజ్జనాలు జరుపుతున్నారు. ఈ ప్రాంతాల్లో ఎక్కువ మంది నిమజ్జన కార్యక్రమాలు సముద్ర తీరంలో జరుపుతుంటారు. ఎప్పటి లాగానే గ్రామస్తులు తిరుపతి జిల్లా తూపిల్ల పాలెం బీచ్ కు గణేష్ విగ్రహాలతో భారీ ర్యాలీగా వచ్చారు. మధ్యాహ్నం మూడు గంటల ప్రాంతంలో చిట్టమూరుకి చెందిన ఉత్సవ కమిటీ సభ్యులు, భక్తులు సముద్ర తీరానికి చేరుకున్నారు. నిమజ్జనానికి ముందుగా తీరం వద్ద ప్రత్యేక పూజలు చేపడుతున్నారు.. అప్పటికే అక్కడ నిమజ్జనం కోసం వచ్జిన మరో కమిటీకి చెందిన కమిటీసభ్యులు, భక్తులు గణేష్ ఉత్సవ మూర్తిని సముద్రంలో నిమజ్జనం చేసేందుకు నీళ్లలోకి దిగారు. కాళ్లపై ఏదో తచ్చాడుతున్నట్లు గమనించారు. సముద్ర తీరానికి కొట్టుకొచ్చిన వస్తువులు అనుకున్నారు.
ఇంకాస్త లోతుల్లోకి వెళ్లారు.. అంతే ఎదో తమను గాయపరుస్తున్నట్లు గుర్తించారు. నిముషాల్లోని ఒక్కసారిగా 14 మందిపై దాడి జరిగింది. తీరం వద్ద ఉన్న కొందరు భక్తులు చేప దాడి చేసినట్లు గుర్తించి చెప్పేవరకు తెలియలేదు. దాడి చేసిన చేప ఎంటనేది ఎవరూ చెప్పలేకపోతున్నారు. కొందరు మాత్రం భారీ సైజులో ఉన్న చేప అంటున్నారు. మరికొందరు టేకు చేపగా చెబుతుండగా.. ఇంకొందరు బ్లూ స్ప్రింగ్ ఫిష్ అంటున్నారు. గాయపడ్డ వారికి స్థానిక వైద్యులు చికిత్స చేశారు. మత్స్యశాఖ అధికారులు వాస్తవాలను గుర్తించే పనిలో ఉన్నారు. ఈ ప్రాంతంలో చేపల దాడి జరగడం మాత్రం కలకలం రేపింది. దీంతో మిగిలిన వారు నిమజ్జనం కోసం అక్కడకు వెళ్ళడానికి భయపడుతున్నారు. శుక్రవారం జరగాల్సిన నిమజ్జనాలు మరో చోట జరపాలని భావిస్తున్నారు.