ఆంధ్రప్రదేశ్ క్యాపిటల్ రీజియన్ డెవలప్‌మెంట్ అథారిటీ ఉద్యోగాలకు నోటిఫికేషన్.. ఎలాంటి రాత పరీక్ష లేదు
ANDHRAPATRIKA : – – విజయవాడలోని ఆంధ్రప్రదేశ్ క్యాపిటల్ రీజియన్ డెవలప్‌మెంట్ అథారిటీ (APCRDA)… ఒప్పంద ప్రాతిపదికన కింది రిమోట్ సెన్సింగ్ అసిస్టెంట్, ప్లానింగ్ అసిస్టెంట్ తదితర పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్ధుల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తూ నోటిఫికేషన్ విడుదల చేసింది.
అర్హులైన అభ్యర్థులు నవంబర్ 13, 2024వ తేదీలోగా ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఈ నోటిఫికేషన్ కింద మొత్తం 19 పోస్టులను భర్తీ చేయనున్నారు.
పోస్టుల వివరాలు ఇవే..
-
జీఐఎస్ & రిమోట్ సెన్సింగ్ అసిస్టెంట్ పోస్టుల సంఖ్య: 6
-
ప్లానింగ్ అసిస్టెంట్ పోస్టుల సంఖ్య: 2
-
సీనియర్ లైవ్లీహుడ్ స్పెషలిస్ట్ పోస్టుల సంఖ్య: 1
-
జూనియర్ లైవ్లీహుడ్ స్పెషలిస్ట్ పోస్టుల సంఖ్య: 3
-
జెండర్/ జీబీవీ స్పెషలిస్ట్ పోస్టుల సంఖ్య: 1
-
సీనియర్ ఆక్యుపేషనల్ హెల్త్ అండ్ సేఫ్టీ స్పెషలిస్ట్ పోస్టుల సంఖ్య: 2
-
జూనియర్ ఆక్యుపేషనల్ హెల్త్ అండ్ సేఫ్టీ స్పెషలిస్ట్ పోస్టుల సంఖ్య: 4
పోస్టును బట్టి సంబంధిత విభాగంలో బీఆర్క్, బీటెక్/ బీఈ, ఎంఈ/ ఎంటెక్, పీజీ, బ్యాచిలర్ ఆఫ్ ఆర్కిటెక్చర్ లేదా బ్యాచిలర్ ఆఫ్ ప్లానింగ్, సోషల్ వర్క్/ రూరల్ డెవలప్‌మెంట్/ ఎకనామిక్స్/ బిజినెస్ అడ్మినిస్ట్రేషన్/ పబ్లిక్ పాలసీ/ ఆక్యుపేషనల్ హెల్త్ అండ్ సేఫ్టీ/ ఎన్విరాన్‌మెంటల్ హెల్త్/ ఇండస్ట్రియల్ సేఫ్టీ లేదా తత్సమాన కోర్సులో ఉత్తీర్ణత పొంది ఉండాలి. అలాగే సంబంధిత విభాగంలో 2 నుంచి పదేళ్లపాటు పని అనుభవం కూడా ఉండాలి.
ఆసక్తి కలిగిన వారు ఆన్‌లైన్ విధానంలో నవంబర్ 13, 2024వ తేదీ వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. ఎలాంటి రాత పరీక్ష ఉండదు. విద్యార్హతలు, ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక చేస్తారు. ఎంపికైన వారు విజయవాడ, అమరావతిలో పని చేయవల్సి ఉంటుంది. ఇతర వివరాలు అధికారిక నోటిఫికేషన్‌లో చెక్ చేసుకోవచ్చు.