Vijawada: ప్రపంచ వారసత్వ సాగునీటి కట్టడంగా ప్రకాశం బ్యారెజ్‌కు అరుదైన గౌరవం దక్కింది. దేశ వ్యాప్తంగా ఎంపికైన నాలుగు కట్టడాల్లో ప్రకాశం బ్యారేజ్ కూడ స్థానం దక్కించుకుంది. విజయవాడ వద్ద కృష్ణా నదిపై గల ప్రకాశం బ్యారేజికి ఇంటర్నేషనల్ కమీషన్ ఆన్ ఇరిగేషన్ అండ్ డ్రైనేజి(ICID)కు సంబంధించిన వరల్డ్ హెరిటేజ్..
ప్రపంచ వారసత్వ సాగునీటి కట్టడంగా ప్రకాశం బ్యారెజ్‌కు అరుదైన గౌరవం దక్కింది. దేశ వ్యాప్తంగా ఎంపికైన నాలుగు కట్టడాల్లో ప్రకాశం బ్యారేజ్ కూడ స్థానం దక్కించుకుంది. విజయవాడ వద్ద కృష్ణా నదిపై గల ప్రకాశం బ్యారేజికి ఇంటర్నేషనల్ కమీషన్ ఆన్ ఇరిగేషన్ అండ్ డ్రైనేజి(ICID)కు సంబంధించిన వరల్డ్ హెరిటేజ్ ఇరిగేషన్ స్ట్రక్చర్స్ (WHIS)అవార్డుకు ఎంపికైంది. వ్యవసాయంలో సమర్ధవంతంగా నీటిని వినియోగించే హెరిటేజ్ స్ట్రక్చర్లను గుర్తించేందుకు ఈరంగంలో పరిశోధనలు జరిపే పరిశోధకులను ప్రోత్సహించే లక్ష్యంతో ఐసిఐడి ఈ అవార్డులను ఇస్తుంది.
వరల్డ్ హెరిటేజ్ ఇరిగేషన్ స్ట్రక్చర్స్ 2023 అవార్డులకు ఐసిఐడి, ఐఎన్సిడిల తరపున నామినేషన్లు కోరగా వచ్చిన నామినేషన్లలో 19 నిర్మాణాలను ఈ అవార్డులకు ప్యానల్ జడ్జెస్ సిఫార్సు చేసి ఎంపిక చేయగా వాటిలో భారతదేశం నుండి 4 నిర్మాణాలను ఈ వరల్డ్ హెరిటేజ్ ఇరిగేషన్ స్ట్రక్చర్స్ 2023 అవార్డుకు ఎంపిక చేసింది.
భారతదేశం నుండి ఎంపికైన 4 నిర్మాణాలలో కృష్ణా నదిపై గల ప్రకాశం బ్యారేజితో పాటు ఒడిస్సా లోని బలిద్హిహా(Balidiha)ప్రాజెక్టు, జయమంగళ ఆనకట్టలు, తమిళనాడులోని శ్రీవాయికుంటం(Srivaikuntam)ఆనకట్ట ఈ అవార్డుకు ఎంపిక అయ్యాయి. ఈవిధంగా ఎంపికైన నిర్మాణాలను వరల్డ్ హెరిటేజ్ ఇరిగేషన్ స్ట్రక్చర్లకు సంబంధించిన ఐసిఐడి రిజిష్టర్ లో నమోదు చేశారు. ఈ వరల్డ్ హెరిటేజ్ ఇరిగేషన్ స్ట్రక్చర్స్ అవార్డుకు ఎంపికైన రాష్ట్రాలకు నవంబరు 2నుండి 8 వరకూ విశాఖపట్నంలో జరిగే 25వ ఐసిఐడి కాంగ్రెస్ అలాగే 74వ ఐఇసి సమావేశంలో ఈ అవార్డులను ఆయా రాష్ట్రాలకు ఇవ్వనున్నారు. 4,014 అడుగుల పొడవున్న ప్రకాశం బ్యారేజ్ ను బ్రిటిష్ కాలంలో సర్ అర్ధన్ కాటన్ చేపట్టాడు.1952 లో ప్రారంభం అయిన ఈ ప్రాజెక్ట్ కట్టడం 1855 లోపూర్తయింది. కృష్ణ గుంటూరు జిల్లాలోని డెల్టా ప్రాంతానికి సాగునీటిని అందించే నీటి పారుదల ప్రాజెక్ట్ ఇది. ఎన్నో తీవ్ర మైన వరదలను తట్టుకుని చెక్కుచెదరకుండా ఇప్పటికీ అలానే ఉంది. అలాంటి ఈ ప్రాజెక్ట్‌కు ఇప్పుడైనా అరుదైన గౌరవం దక్కటంతో కృష్ణ డెల్టా ఆయకట్టు రైతులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.