న్యూఢల్లీి, మార్చి 25 (ఆంధ్రపత్రిక) : కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ లేవనెత్తిన ప్రశ్నలు ఇక దేశమంతా ప్రతి ధ్వనిస్తాయని ఆయన సోదరి, కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ వాద్రా ప్రకటించారు. ట్విటర్ వేదికగా శనివారం ప్రియాంక ప్రధాని నరేంద్ర మోడీపై విమర్శ నాస్త్రాలు సంధించారు. ప్రజల గొంతు కను అణిచివేయడం సాధ్యం కాదని ఆమె స్పష్టం చేశారు. పార్లమెంట్ కార్యకలాపాలకు సంబంధించిన వీడియోను ఆమె పోస్టు చేస్తూ..ఈ ప్రశ్నలు వేసినందుకే రాహుల్ గాంధీపై దాడి చేశారని ఆమె రాసుకొచ్చారు. ప్రజలు ఎన్నుకున్న ప్రజాప్రతినిధి ప్రజల తరఫున ప్రశ్నలు లేవనెత్తితే అదానీ నౌకరు ఆ గొంతును నొక్కివేయడానికి కుట్రపన్నారని ఆమె ఆరోపించారు. మోడీ ప్రభుత్వం ప్రజలకు జవాబు చెప్పక తప్పదని ఆమె స్పష్టం చేశారు.శుక్రవారం కూడా ప్రియాంక మోడీ ప్రభుత్వంపై వరుస ట్వీట్లు చేశారు. దేశం కోసం ప్రాణాలర్పించిన ఒక ప్రధాని(రాజీవ్ గాంధీ) కుమారుడిని దేశద్రోహి అంటూ మోడీ అనుచరులు నిందించారని ఆమె పేర్కొన్నారు. గాంధీ కుటుంబాన్ని, కశ్మీరు పండిట్లు అందరినీ మోడీ పార్లమెంట్‌లో అవమానించారని ఆమె అన్నారు. అయినప్పటికీ ఆయనకు రెండేళ్ల జైలు శిక్ష పడలేదని, ఆయన పార్లమెంట్ సభ్యత్వం నుంచి అనర్హుడు కాలేదని ప్రియాంక వ్యాఖ్యానించారు. దేశ పార్లమెంట్ కన్నా, ప్రజల కన్నా విూ స్నేహితుడు గౌతమ్ అదానీయే గొప్పవాడా అంటూ కూడా ఆమె మోడీని ప్రశ్నించారు.
రాహుల్‌పై అనర్హత వేటు Ñ నేడు గాంధీభవన్‌లో కాంగ్రెస్ దీక్ష కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీపై అనర్హత వేటును ఖండిస్తూ ఆదివారం నిరసనలకు కాంగ్రెస్ పిలుపునిచ్చింది. గాంధీభవన్‌లో ఒకరోజు దీక్ష చేయాలని కాంగ్రెస్ నేతలు నిర్ణయించారు. ఈ మేరకు గాంధీభహవన్‌లో వనివారం జీహెచ్‌ఎంసీ నాయకులతో కాంగ్రెస్ నేతలు సమావేశమయ్యారు. రాహుల్ గాంధీపై అనర్హత వేటును ఖండిస్తూ నిరసనలకు పిలుపునిచ్చారు. ఆదివారం హైదరాబాద్ వ్యాప్తంగా ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు నిరసన కార్యక్రమాలు చేపట్టాలని నిర్ణయించారు. అంతేకాకుండా గాంధీ విగ్రహం ఎదుట బైఠాయించి, నిరసన చేయాలని నిర్ణయిం చారు. ఈ మేరకు నగర నాయకులంతా నిరసనల్లో పాల్గనాలని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి పిలుపు నిచ్చారు. ఈ సమావేశానికి కార్పొరేటర్లు, మాజీ కార్పొరేటర్లు, ఇతర కాంగ్రెస్ నేతలు హాజరయ్యారు. ఇదు తరుణంలో నేడు ఓయూలో నిరుద్యోగ యువత నిరసన ర్యాలీ చేపట్టింది. సేవ్ రాహుల్ గాంధీ, సేవ్ డెమోక్రసీ అంటూ నినాదాలు చేశారు. కేంద్రం తీరును వారు తీవ్రంగా ఖండిరచారు.
Trending
- ఆక్స్ఫర్డ్ భవానిపురం స్కూల్లో బాలల దినోత్సవం వేడుకలు అంగరంగ వైభవంగా నిర్వహించారు.
- ఆక్స్ఫర్డ్ స్కూల్‌లో ఘనంగా బాలల దినోత్సవం
- AP TET 2024 Results: మరికాసేపట్లో టెట్ ఫలితాలు వచ్చేస్తున్నాయ్..
- AP Mega DSC Notification: మరో 2 రోజుల్లోనే మెగా డీఎస్సీ నోటిఫికేషన్ వచ్చేస్తోంది.. జిల్లాల వారీ ఖాళీలు ఇవే!
- Tirumala: నాగుల చవితి సందర్భంగా రేపు పెద్ద శేష వాహనం సేవ.. దేవేరులతో కలిసి శ్రీవారు భక్తులకు దర్శనం..
- AP News: ట్రెండింగ్ చేస్తున్నారా? అయితే వీళ్లకు చిక్కితే అంతే సంగతులు..
- Running Train: రన్నింగ్ ట్రైన్ నుంచి కాలువలోకి దూకేసిన మహిళ.. ఆ తర్వాత ఏం జరిగిందంటే?
- సెక్యూరిటీ గార్డు డాక్టర్ అయ్యాడు! ఏకంగా రోగికి కట్టుకట్టి ఇంజెక్షన్ కూడా ఇచ్చాడు!