డిసెంబర్ 27 (ఆంధ్రపత్రిక): సంక్రాంతికి ’వాల్తేరు వీరయ్య’గా ప్రేక్షకుల ముందుకొస్తున్నారు చిరంజీవి. బాబి దర్శకత్వంలో రూపొందుతున్న ఈ మాస్ ఎంటర్టైనర్కు సంబంధించి ఇప్పటికే విడుదలైన బాస్ పార్టీ, నువ్వు శ్రీదేవి నేను చిరంజీవి పాటలు ప్రజాదరణ పొందాయి. ’తుఫాను అంచున తపస్సు చేసే వశిష్ఠుడు’ అంటూ సాగే టైటిల్ సాంగ్‌ను సోమవారం రిలీజ్ చేశారు. పవర్‌ఫుల్‌గా సాగిన ఈ పాటను బ్యాంకాక్ మ్యుజీషియన్స్‌తో కలిసి రికార్డు చేశారు దేవిశ్రీ ప్రసాద్.’భగ భగ భగ మండే.. మగ మగ మగాడురా వీడే.. జగ జగ జగాన్ని చెండాడే.. ధగ ధగ జ్వలించు సూరీడే.. అగాధ గాథల అనంత లోతుల.. సముద్ర సోదరుడే వీడే.. వినాశ కారుల స్మశానమౌతాడే.. తుఫాను అంచున తపస్సు చేసే వశిష్ఠుడంటే అది వీడే.. తలల్ని తీసే విశిష్టుడే వీడే’ అంటూ వీరయ్య క్యారెక్టర్‌ను హైలెట్ చేస్తూ చంద్రబోస్ లిరిక్స్ రాశారు. అనురాగ్ కులకర్ణి ఎనర్జిటిక్‌గా పాడాడు. ఈ సందర్భంగా విడుదల చేసిన పోస్టర్లో మెషీన్ గన్ పట్టుకుని మాస్ గెటప్‌లో స్టైలిష్‌గా కనిపిస్తున్నారు చిరంజీవి. ఇక చిరంజీవికి జంటగా శ్రుతిహాసన్ నటిస్తున్న ఈ చిత్రంలో రవితేజ కీలక పాత్ర పోషిస్తున్నాడు. మైత్రీ మూవీ మేకర్స్ సంస్థ నిర్మిస్తున్న ఈ చిత్రం జనవరి 13న విడుదల కానుంది.
Trending
- ఆక్స్ఫర్డ్ భవానిపురం స్కూల్లో బాలల దినోత్సవం వేడుకలు అంగరంగ వైభవంగా నిర్వహించారు.
- ఆక్స్ఫర్డ్ స్కూల్లో ఘనంగా బాలల దినోత్సవం
- AP TET 2024 Results: మరికాసేపట్లో టెట్ ఫలితాలు వచ్చేస్తున్నాయ్..
- AP Mega DSC Notification: మరో 2 రోజుల్లోనే మెగా డీఎస్సీ నోటిఫికేషన్ వచ్చేస్తోంది.. జిల్లాల వారీ ఖాళీలు ఇవే!
- Tirumala: నాగుల చవితి సందర్భంగా రేపు పెద్ద శేష వాహనం సేవ.. దేవేరులతో కలిసి శ్రీవారు భక్తులకు దర్శనం..
- AP News: ట్రెండింగ్ చేస్తున్నారా? అయితే వీళ్లకు చిక్కితే అంతే సంగతులు..
- Running Train: రన్నింగ్ ట్రైన్ నుంచి కాలువలోకి దూకేసిన మహిళ.. ఆ తర్వాత ఏం జరిగిందంటే?
- సెక్యూరిటీ గార్డు డాక్టర్ అయ్యాడు! ఏకంగా రోగికి కట్టుకట్టి ఇంజెక్షన్ కూడా ఇచ్చాడు!