కె.కోటపాడు,ఫిబ్రవరి16(ఆంధ్రపత్రిక):
విద్యార్థులు ప్రణాళికాబద్దంగా చదివి పరీక్షల్లో వంద శాతం మార్కులు సాధించాలని అమ్మ చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ గొంప వెంకటరావు అన్నారు. మండలంలోని ఎ.కోడూరు జడ్పీ హైస్కూల్ 10వ తరగతి విద్యార్థులకు ట్రస్ట్ తరపున ప్రతినిధులు చేతుల మీదుగా గురువారం స్టడీ మెటీరియల్ పంపిణీ చేశారు. హెచ్.ఎం.అనూరాధ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ ఉత్తమ ఫలితాలు సాధించి తల్లిదండ్రులుకు, ఉపాధ్యాయులుకు మంచి పేరు తీసుకురావాలని కోరారు. సూరెడ్డి బాబూరావు మాస్టారు మాట్లాడుతూ ప్రతీవిద్యార్థి పరీక్షల్లో ఉత్తమ ఫలితాలు సాధించాలనికోరారు. బయాలజీ టీచర్ లెక్కల ఎరుకునాయుడు మాట్లాడుతూ అమ్మ చారిటబుల్ ట్రస్ట్ సేవలను కొనియాడారు.ఈ కార్యక్రమంలో ట్రస్ట్ సభ్యులు లెక్కల సత్యనారాయణ మాస్టారు(రిటైర్డ్), ట్రస్ట్ వైస్ చైర్మన్ సింగంపల్లి అర్జున, లెక్కల కోటేశ్వరరావు, యడ్ల గోవింద మాస్టారు, ఉపాధ్యాయులు, సిబ్బంది, విద్యార్థులు పాల్గొన్నారు.
Trending
- ఆక్స్ఫర్డ్ భవానిపురం స్కూల్లో బాలల దినోత్సవం వేడుకలు అంగరంగ వైభవంగా నిర్వహించారు.
- ఆక్స్ఫర్డ్ స్కూల్‌లో ఘనంగా బాలల దినోత్సవం
- AP TET 2024 Results: మరికాసేపట్లో టెట్ ఫలితాలు వచ్చేస్తున్నాయ్..
- AP Mega DSC Notification: మరో 2 రోజుల్లోనే మెగా డీఎస్సీ నోటిఫికేషన్ వచ్చేస్తోంది.. జిల్లాల వారీ ఖాళీలు ఇవే!
- Tirumala: నాగుల చవితి సందర్భంగా రేపు పెద్ద శేష వాహనం సేవ.. దేవేరులతో కలిసి శ్రీవారు భక్తులకు దర్శనం..
- AP News: ట్రెండింగ్ చేస్తున్నారా? అయితే వీళ్లకు చిక్కితే అంతే సంగతులు..
- Running Train: రన్నింగ్ ట్రైన్ నుంచి కాలువలోకి దూకేసిన మహిళ.. ఆ తర్వాత ఏం జరిగిందంటే?
- సెక్యూరిటీ గార్డు డాక్టర్ అయ్యాడు! ఏకంగా రోగికి కట్టుకట్టి ఇంజెక్షన్ కూడా ఇచ్చాడు!