విశాఖపట్నం, ఏప్రిల్ 14 (ఆంధ్రపత్రిక):
స్థానిక ఏపి ఈపీడీసీఎల్ విశాఖపట్నం సర్కిల్ కార్యాలయంలో డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ జయంతి వేడుకలు శుక్రవారం ఘనంగా జరిగాయి. సూపరింటెండింగ్ ఇంజనీర్ ఎల్ మహేంద్ర నాథ్, ముందుగా బిఆర్ అంబేద్కర్ చిత్రపటానికి పూలమాలవేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ బహుముఖ ప్రజ్ఞాశాలి అని, భారత దేశ రాజ్యాంగం రచించడంలో కీలకపాత్ర వహించారని, యువత అంబేద్కర్ ని స్ఫూర్తిగా తీసుకొని, ఆయన ఆశయ సాధనకు కృషి చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమానికి ఏపీ ఎస్ఇబి ఎస్ సి, ఎస్ టి ఎంప్లాయిస్ అసోసియేషన్ రీజినల్ కార్యదర్శి చెల్లి రుషికేశ్ అధ్యక్షత వహించారు. ఆ అసోసియేషన్ అధ్యక్షుడు ఈశ్వర రావు, జోన్ 2 అధ్యక్ష కార్యదర్శులు ఆర్ నారాయణరావు, ఎం ప్రసాద్, బహుజన ఎంప్లాయిస్ అసోసియేషన్ అధ్యక్ష కార్యదర్శులు మధు, ప్రసాద్ తదితరులు పాల్గొని అంబేద్కర్ కు ఘన నివాళులర్పించారు.