చిలకలూరిపేట,ఏప్రిల్ – 14, (ఆంధ్ర పత్రిక)*:-డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ 132వ జన్మదినాన్ని పురస్కరించుకొని పట్టణంలోని కళామందిర్ సెంటర్ మున్సిపల్ కాంప్లెక్స్ వద్ద ఉన్న అంబేద్కర్ విగ్రహానికి నియోజకవర్గ దళిత నాయకుల ఆధ్వర్యంలో పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు.ముందుగా డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ జన్మదిన కేకును దళిత నాయకులు కట్ చేసి శుభాకాంక్షలు తెలిపారు.దళిత నాయకుడు మైలా గణేష్ ఈ సందర్భంగా మాట్లాడుతూ నియోజకవర్గ ప్రజలందరికీ డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్132వ జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు.ముఖ్యంగా భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ చిత్రమును భారత కరెన్సీ నోటు పై ముద్రించవలసిందిగా డిమాండ్ చేస్తున్నాము అని తెలిపారు. ఈ కార్యక్రమంలో దళిత నాయకులు, యువకులు, అంబేద్కర్ వాదులు, తదితరులు పాల్గొన్నారు.
Trending
- ఆక్స్ఫర్డ్ భవానిపురం స్కూల్లో బాలల దినోత్సవం వేడుకలు అంగరంగ వైభవంగా నిర్వహించారు.
- ఆక్స్ఫర్డ్ స్కూల్‌లో ఘనంగా బాలల దినోత్సవం
- AP TET 2024 Results: మరికాసేపట్లో టెట్ ఫలితాలు వచ్చేస్తున్నాయ్..
- AP Mega DSC Notification: మరో 2 రోజుల్లోనే మెగా డీఎస్సీ నోటిఫికేషన్ వచ్చేస్తోంది.. జిల్లాల వారీ ఖాళీలు ఇవే!
- Tirumala: నాగుల చవితి సందర్భంగా రేపు పెద్ద శేష వాహనం సేవ.. దేవేరులతో కలిసి శ్రీవారు భక్తులకు దర్శనం..
- AP News: ట్రెండింగ్ చేస్తున్నారా? అయితే వీళ్లకు చిక్కితే అంతే సంగతులు..
- Running Train: రన్నింగ్ ట్రైన్ నుంచి కాలువలోకి దూకేసిన మహిళ.. ఆ తర్వాత ఏం జరిగిందంటే?
- సెక్యూరిటీ గార్డు డాక్టర్ అయ్యాడు! ఏకంగా రోగికి కట్టుకట్టి ఇంజెక్షన్ కూడా ఇచ్చాడు!