మచిలీపట్నం నవంబర్ 13 ఆంధ్రపత్రిక.:
అమావాస్య ఘడియల్లో అత్యద్భుత ఫలితాలను అందించాలని భక్తులు స్థానిక ఈడేపల్లి శక్తి గుడి యందు అఖండ అభిషేకాలు నిర్వహించారు. ఈ సంవత్సరము దీపావళి అమావాస్యనాడు అత్యంత భక్తిశ్రద్ధలతో ఈ దేవాలయంలో అభిషేకాలు అర్చనలు నిర్వహించారు . ప్రతి ఏటా దీపావళికి ఇలా అభిషేకాలు ,పూజలు అమ్మవారికి నిర్వహించడం ఆనవాయితీ. దీపావళి కాంతుల్లా ప్రతి ఇంటా వెలుగులు ప్రసరించి ప్రజలు సుభిక్షంగా ఆనందంగా ఆరోగ్యంగా ఉండాలని అమ్మ వారిని ప్రార్థిస్తారు. క్షేమ, స్థైర్యం, విజయ, అభయ, ఆరోగ్య, ఆనందమయ జీవనానికి పూజలు ఆచరిస్తారు.అమ్మవారికి పూలమాలతో విశేషాలంకరణలు చేసి నిమ్మకాయ దండలను కూడా వేస్తారు. నగరంలోనే కాక చుట్టుపక్కల ప్రాంతాల నుండి కూడా అసోసియేషన్ సంఖ్యలో భక్తులు విచ్చేసి అమ్మవారి దర్శనాన్ని చేసుకుంటారు. శ్రద్ధ ,భక్తి ,ఆరాధన, నియమ నిష్ఠలతో అమ్మవారిని అత్యంత భక్తిశ్రద్ధలతో కొలుస్తారు. ఈ కార్యక్రమమునకు ప్రధాన అర్చకుడు బాబీ ,ఐఓబి శ్రీనివాస్ మొదలగు భక్తులు సహకారం అందించారు. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని అమ్మవారి ఆశీస్సులు , తీర్థప్రసాదాలు పొందారు.