- విజయసాయి ప్రశ్నకు కేంద్రమంత్రి నిత్యానందరాయ్ జవాబు
న్యూఢిల్లీ,ఫిబ్రవరి 8 : రాజధాని అమరావతిపై కేంద్రం సంచలన ప్రకటన చేసింది. ఏపీ రాజధాని అమరావతే అంటూ కేంద్ర ప్రభుత్వం కుండబద్దలు కొట్టింది. విజభన చట్టం ప్రకారం అమరావతి ఏర్పాటైందని స్పష్టం చేసింది. ఆంధ్రప్రదేశ్ కు రాజధాని అమరావతి అని, రాష్ట్ర విభజన చట్టం ప్రకారం ఏర్పాటైందని కేంద్రం స్పష్టం చేసింది. మూడు రాజధానులపై ఎంపీ విజయసాయిరెడ్డి అడిగిన ప్రశ్నకు కేంద్రం ఈ మేరకు సమాధానం ఇచ్చింది. 2015లో అమరావతిని రాజధానిగా నాటి ఏపీ ప్రభుత్వం నోటిఫై చేసిందన్న కేంద్రం.. ఆ తర్వాత 2020లో 3 రాజధానుల బిల్లును ఏపీ ప్రభుత్వం తీసుకొచ్చిందని. ఈ చట్టాలను చేసేటప్పుడు రాష్ట్ర ప్రభుత్వం కేంద్రాన్ని సంప్రదించలేదని వివరించింది. ఆ తర్వాత ఈ చట్టాలను రాష్ట్ర ప్రభుత్వం వెనక్కి తీసుకుంది. ప్రస్తుతం ఈ వ్యవహారం న్యాయస్థానం ఉనికిలో ఉంది. ఈ మేరకు కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి నిత్యానంద రాయ్ లిఖితపూర్వకంగా ఇచ్చారు. ఏపీ విభజన చట్టంలోని సెక్షన్ 5, 6 లతో రాజధాని అమరావతిని కేంద్రం ముడిపెట్టింది. విభజన చట్టంలోని నిబంధనల ప్రకారం అమరావతి ఏర్పాటు అయ్యిందని తేల్చిచెప్పింది. దీంతో రాజధానిని ఏర్పాటు చేసుకునే స్వేచ్ఛ ఏపీకి లేదని కేంద్రం చెప్పకనే చెప్పింది. మూడు రాజధానులపై జగన్ ప్రభుత్వం కేంద్రాన్ని సంప్రదించలేదని… జగన్ ప్రభుత్వం మూడు రాజధానులకోసం చేసిన చట్టాలతో సంబంధం లేదని స్పష్టం చేసింది. జగన్ మూడు రాజధానుల చట్టాలతో తమకేవీ సంబంధం లేదని కేంద్రం సంకేతం ఇచ్చింది. అమరావతే రాజధాని అని 2015లో నిర్ణయించారని కేంద్రం స్పష్టం చేసింది. ఏపీ రాజధాని అంశంపై బుధవారం రాజ్యసభలో వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి అడిగిన ప్రశ్నకు కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి నిత్యానంద రాయ్ ఈ మేరకు రాతపూర్వకంగా సమాధానం ఇచ్చారు. అమరావతిని రాజధానిగా ఏపీ ప్రభుత్వం 2015లోనే నోటిఫై చేసిందని కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. అయితే రాజధానిని నిర్ణయించే అధికారం రాష్ట్ర ప్రభుత్వానికి ఉంటుందని కేంద్రం ముక్త కంఠంతో చెప్పిందా? అని ఎంపీ విజయసాయి రెడ్డి ప్రశ్నకు సమాధానం ఇచ్చేందుకు కేంద్రం నిరాకరించింది. ఆంధ్రప్రదేశ్ రాజధాని అంశం ప్రస్తుతం న్యాయస్థానాల పరిధిలో ఉందని కేంద్రం ఉంది. ఒప్పందం మాట్లాడటం కోర్టు ధిక్కారణ కిందకు వస్తుందని. ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టం సెక్షన్ 5, 6 ప్రకారం కేంద్ర ప్రభుత్వం నిపుణుల కమిటీని నూతన రాజధాని నిర్మాణానికి అధ్యయనం చేసిందని వెల్లడిరచింది. అధ్యయన నివేదిక తదుపరి చర్యల నిమిత్తం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి పంపించడం జరిగింది… ఆ తరువాత ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 2015లో అమరావతిని రాజధానిగా నోటిఫై చేసిందని పేర్కొంది. ఆ తర్వాత 2020లో మూడు రాజధానుల బిల్లును తీసుకువచ్చారని. మూడు రాజధానుల బిల్లు తీసుకొచ్చే ముందు ఏపీ ప్రభుత్వం కేంద్రాన్ని సంప్రదించలేదని చెప్పింది.
Trending
- AP TET 2024 Results: మరికాసేపట్లో టెట్ ఫలితాలు వచ్చేస్తున్నాయ్..
- AP Mega DSC Notification: మరో 2 రోజుల్లోనే మెగా డీఎస్సీ నోటిఫికేషన్ వచ్చేస్తోంది.. జిల్లాల వారీ ఖాళీలు ఇవే!
- Tirumala: నాగుల చవితి సందర్భంగా రేపు పెద్ద శేష వాహనం సేవ.. దేవేరులతో కలిసి శ్రీవారు భక్తులకు దర్శనం..
- AP News: ట్రెండింగ్ చేస్తున్నారా? అయితే వీళ్లకు చిక్కితే అంతే సంగతులు..
- Running Train: రన్నింగ్ ట్రైన్ నుంచి కాలువలోకి దూకేసిన మహిళ.. ఆ తర్వాత ఏం జరిగిందంటే?
- సెక్యూరిటీ గార్డు డాక్టర్ అయ్యాడు! ఏకంగా రోగికి కట్టుకట్టి ఇంజెక్షన్ కూడా ఇచ్చాడు!
- చాప్టర్ 3: చెన్నైలో కొడాలి అరెస్ట్.. రజనీ కూతురు బిగ్ స్టెప్..
- Telangana Police: మళ్లీ మొదలైన లోన్ యాప్ ఆగడాలు.. పోలీసుల లేటెస్ట్ అలెర్ట్..!