హైదరాబాద్,ఫిబ్రవరి21 : రాజధానికి పెనుముప్పుగా పరిణమించిన నాలాల విస్తరణతో ఇప్పుడు పలుచోట్ల సమస్యలు తీరుతున్నాయి. చాలాచోట్ల నాలాల విస్తరనతో సమస్యలు తగ్గనున్నాయి. రోడ్ల వెడల్పు సమస్యలు తీరాయి. నాలాల్లో చెత్తా చెదారం పేరుకు పోకుండా తొలగిస్తున్నారు. అయితే పలుచోట్ల కొంతమంది ప్రజాప్రతినిధులే అడ్డంకిగా తయారయ్యారన్న ఆరోపణలు ఉన్నాయి. రాజకీయ ప్రయోజ నాలను ఆశించి కొందరు అడ్డు తగలడంతో ముంపు ఇబ్బందులను తెచ్చిపెడుతున్నారు. పెద్ద నాలాలను విస్తరించడం వల్ల నగరంలో ఎంత వర్షం పడినా ఒక్క ప్రాంతానికీ ముంపు ముప్పు లేకుండా చేయాలన్నది ప్రభుత్వ ఉద్దేశం. దీనికి అనుగుణంగా సర్వే పూర్తయిన పలు ప్రాంతాల్లో మంత్రి తలసాని దగ్గరుండి విస్తరణ పనులు పూర్తి చేయిస్తున్నారు. నాలాలను చాలా వరకు విస్తరిస్తే భవిష్యత్తులో ముంపు ఇబ్బంది ఉండదన్న భావనలో మున్సిపల్ మంత్రి కేటీఆర్ అధికారులకు తగు సూచనలు చేసి ప్రణాలికలు రూపొం దించారు. వచ్చే వర్షాకాలం నాటికైనా కొన్ని నాలాలపై ఆక్రమణలను తొలగించి విస్తరించపోతే మళ్లీ నగరానికి ముంపు ముప్పు తప్పదని నిపుణులు హెచ్చరిస్తున్నారు. అయితే నగరంలోని కొంతమంది ప్రజాప్రతినిధులు పది అడుగుల మేర విస్తరిస్తే వేలాది ఆక్రమణలను తొలగించాల్సి వస్తుందని, అదే జరిగితే ఆమక్రణదారుల నుంచి తీవ్రమైన ప్రతిఘటన ఎదుర్కోవాల్సి వస్తుందని చెబుతున్నారు. ఆక్రమణలు తొలగించకుండా నాలాలు విస్తరించకుండా ప్రస్తుతమున్న నాలాల్లో లోతుగా పూడిక తీస్తే సరిపోతుందని వీరి వాదనగా ఉంది. ఆక్రమణల తొలగింపు మొదలుపెట్టడంతో పలు ప్రాంతాల్లో పనులు జోరుగా సాగుతున్నాయి. ఆక్రమణలతో ప్రవాహ సామర్థ్యం తగ్గి వర్షాకాలంలో ఆ నీరంతా కాలనీలను ముంచెత్తుతోంది. ఫలితంగా ఆస్తి నష్టంతోపాటు అనేకమంది నిరాశ్రయులుగా మారుతున్నారు. ఈ నేపథ్యంలో నగరంలో నాలాల వ్యవస్థను గాడిలో పెడతామని ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రకటించారు.
అందుకు అనుగుణంగా మంత్రి కేటీఆర్ నాలాల ఆక్రమణలపై సర్వేకు ఆదేశించారు. ఈ క్రమంలో నాలాల్లో పూడిక తొలగింపుతో పాటు, విస్తరణ పనులు చురుకుగా సాగుతున్నాయి. వీటిపైనే మహానగరపాలక సంస్థ అధికారులు దృష్టి పెట్టారు. అధికారులు అయిదారు నెలలపాటు శ్రమించి క్షేత్రస్థాయిలో 390 కిలోవిూటర్ల పొడువునా సర్వే చేశారు. ఈ నాలాలపై దాదాపు 12 వేల వరకు ఆక్రమణలు ఉన్నాయని తేల్చారు. వర్షపు నీరు వెళ్లేందుకు ఉన్న కాలువలన్నీ మురుగు నాలాలుగా మారిపోయాయి. పైగా ఇటీవలి వర్షాకాలంలో నిజాంపేట, బాచుపల్లి, బండారి లేఅవుట్, నాచారం, ఆల్విన్ కాలనీ తదితర అనేక ప్రాంతాలు ముంపు నీటిలో చిక్కుకున్నాయి. వీటిని ఎంతమేర విస్తరించాలన్న దానిపైనా సర్వేలో గుర్తించి అందుకు అనుగుణంగా మార్కింగ్ చేశారు. ప్రస్తుతం నగరంలో పడే వర్షం నీటినీ పరిగణనలోకి తీసుకుని ఈ నాలాలను ఆధునీకరిస్తున్నారు.
Trending
- ఆక్స్ఫర్డ్ భవానిపురం స్కూల్లో బాలల దినోత్సవం వేడుకలు అంగరంగ వైభవంగా నిర్వహించారు.
- ఆక్స్ఫర్డ్ స్కూల్లో ఘనంగా బాలల దినోత్సవం
- AP TET 2024 Results: మరికాసేపట్లో టెట్ ఫలితాలు వచ్చేస్తున్నాయ్..
- AP Mega DSC Notification: మరో 2 రోజుల్లోనే మెగా డీఎస్సీ నోటిఫికేషన్ వచ్చేస్తోంది.. జిల్లాల వారీ ఖాళీలు ఇవే!
- Tirumala: నాగుల చవితి సందర్భంగా రేపు పెద్ద శేష వాహనం సేవ.. దేవేరులతో కలిసి శ్రీవారు భక్తులకు దర్శనం..
- AP News: ట్రెండింగ్ చేస్తున్నారా? అయితే వీళ్లకు చిక్కితే అంతే సంగతులు..
- Running Train: రన్నింగ్ ట్రైన్ నుంచి కాలువలోకి దూకేసిన మహిళ.. ఆ తర్వాత ఏం జరిగిందంటే?
- సెక్యూరిటీ గార్డు డాక్టర్ అయ్యాడు! ఏకంగా రోగికి కట్టుకట్టి ఇంజెక్షన్ కూడా ఇచ్చాడు!