జనవరి 02 (ఆంధ్రపత్రిక): సినిమా స్టార్స్ తమ సినిమాలతో ఎంత బిజీగా ఉన్నా సరే ఫ్యామిలీకి టైం కేటాయిస్తూనే ఉంటారు. వారితో సరదాగా గడిపేందుకు వెళ్తుంటారు. ఇక న్యూ ఇయర్ లాంటి టైం లో కంప్లీట్‌గా రెస్ట్ మూడ్‌లో ఉన్నారు. అందుకే ఫ్యామిలీతో జాలీ ట్రిప్‌లు వేస్తున్నారు. ఈ క్రమంలో న్యూ ఇయర్ సందర్భంగా ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ కూడా ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో కలిసి గోవాలో న్యూ ఇయర్ సెలబ్రేట్ చేసుకున్నట్టు తెలుస్తుంది. అల్లు అర్జున్‌తో సతీమణి స్నేహా రెడ్డి దిగిన ఫోటోని ఆమె సోషల్ మీడియాలో షేర్ చేసింది. బీచ్ ఒడ్డున భార్యతో అలా బన్నీ క్యాజువల్ ఫోటో అల్లు ఫ్యాన్స్‌ని విశేషంగా ఆకట్టుకుంటోంది. స్నేహారెడ్డి కూడా హీరోయిన్స్‌కి ఏమాత్రం తీసిపోని విధంగా తన ఫోటో షూట్స్‌తో అలరిస్తుంది. ఆ ఫోటో షూట్స్ కూడా ఆమెకు ప్రత్యేకమైన క్రేజ్ ఏర్పడేలా చేస్తున్నాయి. ప్రస్తుతం పుష్ప 2 సెట్స్ మీద ఉండగా న్యూ ఇయర్ టైంకి ఇలా ఫ్యామిలీతో టైం స్పెండ్ చేస్తూ రిలాక్స్ అవుతున్నాడు అల్లు అర్జున్. మళ్లీ త్వరలో పుష్ప 2 నెక్ట్స్ షెడ్యూల్ మొదలు కాబోతుందని తెలుస్తుంది. అది మొదలైతే మాత్రం మళ్లీ కొన్నాళ్ల పాటు బిజీ బిజీగా ఉంటాడు. అందుకే దొరికిన ఈ కొద్దిపాటి టైం ని ఫ్యామిలీతో ఎంచక్కా గడిపేస్తున్నాడు. అల్లు అర్జున్ స్నేహా రెడ్డిల లేటెస్ట్ ఫోటో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
Trending
- ఆక్స్ఫర్డ్ భవానిపురం స్కూల్లో బాలల దినోత్సవం వేడుకలు అంగరంగ వైభవంగా నిర్వహించారు.
- ఆక్స్ఫర్డ్ స్కూల్‌లో ఘనంగా బాలల దినోత్సవం
- AP TET 2024 Results: మరికాసేపట్లో టెట్ ఫలితాలు వచ్చేస్తున్నాయ్..
- AP Mega DSC Notification: మరో 2 రోజుల్లోనే మెగా డీఎస్సీ నోటిఫికేషన్ వచ్చేస్తోంది.. జిల్లాల వారీ ఖాళీలు ఇవే!
- Tirumala: నాగుల చవితి సందర్భంగా రేపు పెద్ద శేష వాహనం సేవ.. దేవేరులతో కలిసి శ్రీవారు భక్తులకు దర్శనం..
- AP News: ట్రెండింగ్ చేస్తున్నారా? అయితే వీళ్లకు చిక్కితే అంతే సంగతులు..
- Running Train: రన్నింగ్ ట్రైన్ నుంచి కాలువలోకి దూకేసిన మహిళ.. ఆ తర్వాత ఏం జరిగిందంటే?
- సెక్యూరిటీ గార్డు డాక్టర్ అయ్యాడు! ఏకంగా రోగికి కట్టుకట్టి ఇంజెక్షన్ కూడా ఇచ్చాడు!