నేచురల్ స్టార్ నాని, కీర్తి సురేశ్ జంటగా నటించిన చిత్రం ‘దసరా’. ఇటీవలే థియేటర్లలో విడుదలైన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్లు సాధించింది.సింగరేణి గనుల నేపథ్యంలో ఈ సినిమాను శ్రీకాంత్ ఓదెల తెరకెక్కించారు. ఈ చిత్రంలో నాని, కీర్తి సురేశ్ నటనకు సినీ ప్రియులు ఫిదా అయిపోయారు. టాలీవుడ్ ప్రముఖులు సైతం దసరా మూవీపై ప్రశంసలు కురిపించారు. తాజాగా ఈ లిస్ట్‌లో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ కూడా చేరిపోయాడు. దసరా టీం అభినందిస్తూ ఆయన ట్వీట్ చేశారు.అల్లు అర్జున్ ట్వీట్ చేస్తూ..’ దసరా టీమ్ మొత్తానికి నా అభినందనలు. చాలా అద్భుతంగా సినిమా తీశారు. నా సోదరుడు అత్యుత్తమ ప్రదర్శన ఇచ్చాడు. కీర్తి సురేశ్ నటనకు ఫిదా అయిపోయా. దసరా చిత్రబృందం అందరూ చాలా బాగా చేశారు. సంతోశ్ అద్భుతమైన పాటలు, బ్యాక్ గ్రౌండ్ స్కోర్ అందించారు. సత్యన్ కెమెరా పనితనం సూపర్బ్. శ్రీకాంత్ ఓదెల ఆరంగ్రేటం అదిరిపోయింది. నిర్మాతలు, అలాగే సినిమాలో ప్రతి ఒక్కరికీ హృదయపూర్వక అభినందనలు. వేసవిలో నిజమైన అసలైన ఎంటర్‌టైనర్ దసరా.’ అంటూ ట్వీట్ చేశారు.
కాగా.. ప్రస్తుతం అల్లు అర్జున్ పుష్ప-2 మూవీతో బిజీగా ఉన్నారు. ఇటీవలే బర్త్‌డే సందర్భంగా ఫ్యాన్స్‌కు అదిరిపోయే అప్‌డేట్ ఇచ్చారు. అల్లు అర్జున్ పుట్టిన రోజు మేకర్స్ పుష్ప-2 గ్లింప్స్ రిలీజ్ చేశారు. ప్రస్తుతం ఆ వీడియో యూట్యూబ్‌లో రికార్డ్‌స్థాయిలో దూసుకెళ్తోంది. రెండేళ్ల క్రితం విడుదలైన సంచలన విజయం సాధించిన ‘పుష్ప’సినిమాకు సీక్వెల్‌గా క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ తెరకెక్కిస్తున్నారు.