పుష్ప సినిమాతో ఏకంగా ప్రపంచ వ్యాప్తంగా తన క్రేజ్ ను పెంచుకున్నాడు అల్లు అర్జున్. సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన పుష్ప సినిమాతో పాన్ ఇండియా స్టార్ గా మారిపోయాడు. పుష్ప సినిమా సంచలన విజయం సాధించింది. ఈ సినిమాలో అల్లు అర్జున్ పుష్ప రాజ్‌గా మాస్ మసాలా పాత్రలో నటించి మెప్పించాడు. అల్లు అర్జున్ నటనకు ప్రేక్షకులంతా ఫిదా అయ్యారు.
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ పేరు ఇప్పుడు మరు మ్రోగిపోతోంది. మొన్నటివరకు టాలీవుడ్ లో స్టార్ హీరోగా దూసుకుపోయిన బన్నీ ఇప్పుడు పాన్ ఇండియా స్టార్ గా ఎదిగాడు. పుష్ప సినిమాతో ఏకంగా ప్రపంచ వ్యాప్తంగా తన క్రేజ్ ను పెంచుకున్నాడు అల్లు అర్జున్. సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన పుష్ప సినిమాతో పాన్ ఇండియా స్టార్ గా మారిపోయాడు. పుష్ప సినిమా సంచలన విజయం సాధించింది. ఈ సినిమాలో అల్లు అర్జున్ పుష్ప రాజ్‌గా మాస్ మసాలా పాత్రలో నటించి మెప్పించాడు. అల్లు అర్జున్ నటనకు ప్రేక్షకులంతా ఫిదా అయ్యారు. ఇక ఈ సినిమాలో అల్లు అర్జున్ నటనకు గాను ఉత్తమ నటుడిగా కేంద్రం నేషనల్ అవార్డును అందించింది. ఉత్తమ నటుడిగా జాతి అవార్డు అందుకున్న ఏకైక టాలీవుడ్ హీరోగా రికార్డు క్రియేట్ చేశాడు అల్లు అర్జున్.
ఈ నెల 17న దేశ రాజధాని ఢిల్లీలో ఈ అవార్డుల వేడుక ఘనంగా జరిగింది. ఈ వేడుకలో దేశ రాష్ట్రపతి ద్వాపది ముర్ము చేతుల మీదుగా అల్లు అర్జున్ అవార్డును అందుకున్నాడు. అల్లు అర్జున్ కు నేషనల్ అవార్డు రావడంతో ఆయన అభిమానులు ఆనందంలో తేలిపోతున్నారు. బన్నీ తెలుగు ఇండస్ట్రీ కీర్తిని పెంచేశాడు అంటూ కొనియాడుతున్నారు ఫ్యాన్స్.
ఇక తాజాగా అల్లు అర్జున్ ఢిల్లీ నుంచి హైదరాబాద్ కు తిరిగి వచ్చారు. నేషనల్ అవార్డు అందుకొని హైదరాబాద్ కు తిరిగి వచ్చిన అల్లు అర్జున్ కు అభిమానులు ఘానా స్వాగతం పలికారు. నిన్నటి నుంచే అల్లు అర్జున్ ఇంటి దగ్గర పెద్దెత్తున అభిమానులు చేరుకొని హంగామా చేశారు. ఇక ఇప్పుడు అల్లు అర్జున్ అవార్డుతో రావడంతో ఆయనకు ఘానా స్వాగతం పలికారు ఫ్యాన్స్. జై బన్నీ అనే నినాదాలతో మారుమ్రోగించారు అభిమానులు. ఇక అభిమానులను చూసిన బన్నీ.. కారు నుంచి అభిమానులకు అభివాదాలు చేశాడు. ఇందుకు సంబంధించిన ఫోటోలు, వీడియోలో సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.