అభిమాని తండ్రి వైద్యానికి ఆర్థిక సాయం
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ తాజాగా తన అభిమాని పట్ల గొప్ప మనసు చాటుకున్నాడు. ఓ అభిమానికి బన్నీ ఆర్థిక సహాయం చేశాడు. అర్జున్ కుమార్ అనే ఓ వీరాభిమాని తండ్రి ఊపిరితిత్తుల సమస్యతో బాధ పడుతున్నారని తెలుసుకొని బన్నీ ఆయనకు వైద్యం చేయించాడు. సర్జరీకి దాదాపు రూ.2 లక్షల కావాల్సి ఉండగా.. వారికి అంత ఆర్థిక స్తోమత లేకపోవడంతో కొందరు బన్నీ అభిమానులు అర్జున్ కుమార్ తండ్రి పరిస్థితిని సోషల్ విూడియా వేదికగా షేర్ చేశారు. ఈ విషయం బన్నీ దృష్టికి వెళ్లడంతో వెంటనే స్పందించి ఆ కుటుంబానికి ఆర్థిక సహాయం అందించాడు. దీనిపై పలువురు నెటీజన్‌లు బన్నీను ప్రశంసిస్తున్నారు. అన్న నాకు నా కుటుంబానికి అండగా ఉన్నందుకు జీవితాంతం విూకు రుణపడి ఉంటా అంటూ అర్జున్ కుమార్ సోషల్ విూడియా వేదికగా తెలిపాడు. ఇక గతంలోనూ బన్నీ తన ఫ్యాన్స్‌కు ఎన్నో సార్లు అండగా ఉన్నాడు. ఇక బన్నీ సినిమాల విషయాల విషయానికొస్తే.. ప్రస్తుతం పుష్ప`2 షూటింగ్‌లో బిజీగా ఉన్నాడు. సుకుమార్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా శరవేగంగా షూటింగ్ జరుపుకుంటుంది. రష్మిక హీరోయిన్‌గా నటిస్తున్న ఈ సినిమాను మైత్రీ సంస్థ నిర్మిస్తుంది.
Trending
- ఆక్స్ఫర్డ్ భవానిపురం స్కూల్లో బాలల దినోత్సవం వేడుకలు అంగరంగ వైభవంగా నిర్వహించారు.
- ఆక్స్ఫర్డ్ స్కూల్‌లో ఘనంగా బాలల దినోత్సవం
- AP TET 2024 Results: మరికాసేపట్లో టెట్ ఫలితాలు వచ్చేస్తున్నాయ్..
- AP Mega DSC Notification: మరో 2 రోజుల్లోనే మెగా డీఎస్సీ నోటిఫికేషన్ వచ్చేస్తోంది.. జిల్లాల వారీ ఖాళీలు ఇవే!
- Tirumala: నాగుల చవితి సందర్భంగా రేపు పెద్ద శేష వాహనం సేవ.. దేవేరులతో కలిసి శ్రీవారు భక్తులకు దర్శనం..
- AP News: ట్రెండింగ్ చేస్తున్నారా? అయితే వీళ్లకు చిక్కితే అంతే సంగతులు..
- Running Train: రన్నింగ్ ట్రైన్ నుంచి కాలువలోకి దూకేసిన మహిళ.. ఆ తర్వాత ఏం జరిగిందంటే?
- సెక్యూరిటీ గార్డు డాక్టర్ అయ్యాడు! ఏకంగా రోగికి కట్టుకట్టి ఇంజెక్షన్ కూడా ఇచ్చాడు!