జివో విడుదల చేసిన ప్రభుత్వం
అమరావతి,నవంబర్ 3 (ఆంధ్రపత్రిక): డాక్టర్ వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీ పథకం కింద వైద్య సేవలు పొంది ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయి ఇంటికివెళ్లే వారికి స్థిరమైన భత్యం అందించేందుకు వీలుగా ప్రభుత్వం బుధవారం గెజిట్ నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ పథకం కింద నగదు రహిత చికిత్సతో పాటు వైద్య పరీక్షలు, మందులు, డిశ్చార్జ్ అయిన తర్వాత ఫాలోఅప్ సస్ట్తెనబుల్ అలవెన్స్ రూ.225 ఇక నుంచి లబ్దిదారులకు అందే ప్రయోజ నాలుగా సూచిస్తారు. కుటుంబ సంవత్సర ఆదాయం రూ.5 లక్షల కంటే తక్కువగా ఉన్న పిల్లలతో సహా కుటుంబ సభ్యులు లబ్దిదారులుగా ఉంటారు. ఇందుకోసం ఆధార్ నమోదు చేయించు కోవాల్సివుంటుంది. ఈ పథకం ద్వారా వ్యక్తిగతంగా సహాయం పొందాలంటే సంబంధిత ధ్రువపత్రాలు సమర్పించాల్సివుంటుంది. 18 ఏళ్లలోపు పిల్లలకు ఆధార్ లేదా, పుట్టిన తేదీ సర్టిఫికెట్, ప్రిన్సిపల్ సంతకంతో కూడిన స్కూలు ఐడి కార్డు ఉండాలని మార్గదర్శకాల్లో పేర్కొన్నారు.