నాంది సినిమాతో మంచి నటుడిగా గుర్తింపు తెచ్చుకున్న అల్లరి నరేశ్ తర్వాత సినిమాల ఎంపికలో కాస్త రూటు మార్చేశాడు. ఈ టాలెంటెడ్ యాక్టర్ ప్రస్తుతం నటిస్తు న్న చిత్రం ఉగ్రం. నాంది ఫేం విజయ్ కనకమేడల మరోసారి ఈ సినిమా కు దర్శకత్వం వహిస్తున్నాడు. మలయాళ భామ మిర్ణా హీరోయిన్గా నటిస్తోంది. తాజాగా ఈ సినిమాకు సంబంధించిన అప్డేట్ వచ్చింది. ఉగ్రం టీజర్‌ను బుధవారం ఉదయం 11:34 గంటలకు లాంఛ్ చేయబోతున్నట్టు తెలియజేస్తూ ఓ పోస్టర్‌ను షేర్ చేసుకున్నాడు అల్లరి నరేశ్. నేను ఇంతకుముందెన్నడూ చేయని, విూరు ఇంతముందు ఎన్నడూ చూడని.. కొత్త అంశంతో విూ ముందుకొస్తున్నా అంటూ టీజర్ అప్డేట్ అందించాడు. డార్క్ షేడ్స్ ఉన్న లొకేషన్ నుంచి అల్లరి నరేశ్ రాయల్ ఎన్ఫీల్డ్ బైక్‌పై వస్తున్న లుక్ సినిమాపై క్యూరియాసిటీ పెంచుతోంది. ఉగ్రం చిత్రానికి టూమ్ వెంకట్, అబ్బూరి రవి కథ, సంభాషణలు సమకూరుస్తున్నారు. స్క్రీన్ బ్యానర్‌పై సాహు గారపాటి, హరీష్ పెద్ది ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఉగ్రం చిత్రానికి శ్రీచరణ్ పాకాల సంగీతం అందిస్తున్నాడు. ఈ మూవీ మే 5న థియేటర్లలో సందడి చేయనుండగా.. ఈ ఏడాది ఇట్లు మారేడుమిల్లి ప్రజానీకం సినిమాతో ప్రేక్షకుల ముందుకొచ్చాడు అల్లరి నరేశ్. ఈ సినిమా ఆశించిన స్థాయిలో ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయింది.
Trending
- ఆక్స్ఫర్డ్ భవానిపురం స్కూల్లో బాలల దినోత్సవం వేడుకలు అంగరంగ వైభవంగా నిర్వహించారు.
- ఆక్స్ఫర్డ్ స్కూల్లో ఘనంగా బాలల దినోత్సవం
- AP TET 2024 Results: మరికాసేపట్లో టెట్ ఫలితాలు వచ్చేస్తున్నాయ్..
- AP Mega DSC Notification: మరో 2 రోజుల్లోనే మెగా డీఎస్సీ నోటిఫికేషన్ వచ్చేస్తోంది.. జిల్లాల వారీ ఖాళీలు ఇవే!
- Tirumala: నాగుల చవితి సందర్భంగా రేపు పెద్ద శేష వాహనం సేవ.. దేవేరులతో కలిసి శ్రీవారు భక్తులకు దర్శనం..
- AP News: ట్రెండింగ్ చేస్తున్నారా? అయితే వీళ్లకు చిక్కితే అంతే సంగతులు..
- Running Train: రన్నింగ్ ట్రైన్ నుంచి కాలువలోకి దూకేసిన మహిళ.. ఆ తర్వాత ఏం జరిగిందంటే?
- సెక్యూరిటీ గార్డు డాక్టర్ అయ్యాడు! ఏకంగా రోగికి కట్టుకట్టి ఇంజెక్షన్ కూడా ఇచ్చాడు!