ఈవీవీ వారసుడిగా డైరెక్టర్ గా కాకపోయినా తన సినిమాలతో ఆడియన్స్‌ని అలరిస్తూ వస్తున్నాడు అల్లరి
నరేష్. తన మొదటి సినిమా అల్లరి నుంచి అతను చేసిన ప్రతి సినిమా ప్రేక్షకులను నవ్విస్తూ వచ్చింది. పేరడీ కామెడీ సినిమా స్పూఫ్ లు ఇలా అల్లరోడు సినిమా అంటే ఎంచక్కా వెళ్లి హాయిగా నవ్వుకుని రావొచ్చు అన్న టాక్ వచ్చింది. అయితే రొటీన్ గా అవే సినిమాలు చేస్తుండటం వల్ల అతను సినిమాలు ఆడియన్స్ కి బోర్ కొట్టేశాయి. ఇక పంథా మార్చాల్సిన టైం వచ్చేసిందని ఫిక్స్ అయిన అల్లరి నరేష్ సీరియస్ కథలతో సినిమాలు చేయాలని ఫిక్స్ అయ్యాడు. ఈ క్రమంలో నాంది సినిమాతో సక్సెస్ అందుకున్న నరేష్ ఇక విూదట కామెడీ సినిమాలు కాదు సీరియస్ కథలతోనే మూవీస్ చేయాలని అనుకున్నాడు. అందుకే వరుస అలాంటి సినిమాలతోనే వస్తున్నాడు. ఈమధ్య వచ్చిన ఇట్లు మారేడుమిల్లి సినిమా కూడా నరేష్ సీరియస్ కథతోనే వచ్చాడు. కానీ ఆ సినిమా ఆడియన్స్ కి రుచించలేదు. అందుకే తనకు నాంది లాంటి హిట్ అందించిన డైరెక్టర్ విజయ్ కనకమేడల డైరెక్షన్ లోనే ఉగ్రం అంటూ సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా టీజర్ తోనే సినిమా ఎలా ఉంటుందో చూపించారు. ఉగ్రం సినిమాలో నరేష్ తన ఉగ్ర రూపం చూపించాడని తెలుస్తుంది. టీజర్ రిలీజ్ టైం లో మాట్లాడుతూ ఇక విూదట అల్లరి నరేష్ లో అల్లరి ఉండదని వరుస సీరియస్ కథలనే చేస్తానని మరోసారి గుర్తుచేశాడు నరేష్. అతన్ని ఆడియన్స్ కు దగ్గర చేసింది అతని అల్లరి. కానీ ఇక విూదట అలాంటి సినిమాలు చేయనని చెప్పి షాక్ ఇచ్చాడు నరేష్. అయితే కథ డిమాండ్ చేసి ష్యూర్ షాట్ హిట్ పక్కా అనిపించే కామెడీ కథలను నరేష్ ఓకే చేసే అవకాశం ఉంది. కానీ మెంటల్ గా మాత్రం ఇక విూదట అల్లరి నరేష్ కనిపించడు నాంది నరేష్ మాత్రమే కనిపిస్తాడని గట్టిగా చెబుతున్నాడు. నరేష్ లో ఈ మార్పు మంచిదే అని కొందరు ఆడియన్స్ అంటున్నా. ఎప్పుడూ సీరియస్ కథలే కాకుండా తనని ఆడియన్స్ కు దగ్గర చేసిన కామెడీ ఎంట్టంల్గªనింగ్ స్టోరీస్ కూడా చేస్తే బాగుంటుందని కొందరి అభిప్రాయం. ఏది ఏమైనా నరేష్ నిర్ణయం అతని కెరీర్ ని ఎలా తీసుకెళ్తుందో చూడాలి. ఉగ్రం సినిమా టీజర్ వరకు బాగానే అనిపించినా అసలు మ్యాటర్ ఏంటన్నది సినిమా వస్తేనే కానీ చెప్పలేం.
Trending
- ఆక్స్ఫర్డ్ భవానిపురం స్కూల్లో బాలల దినోత్సవం వేడుకలు అంగరంగ వైభవంగా నిర్వహించారు.
- ఆక్స్ఫర్డ్ స్కూల్‌లో ఘనంగా బాలల దినోత్సవం
- AP TET 2024 Results: మరికాసేపట్లో టెట్ ఫలితాలు వచ్చేస్తున్నాయ్..
- AP Mega DSC Notification: మరో 2 రోజుల్లోనే మెగా డీఎస్సీ నోటిఫికేషన్ వచ్చేస్తోంది.. జిల్లాల వారీ ఖాళీలు ఇవే!
- Tirumala: నాగుల చవితి సందర్భంగా రేపు పెద్ద శేష వాహనం సేవ.. దేవేరులతో కలిసి శ్రీవారు భక్తులకు దర్శనం..
- AP News: ట్రెండింగ్ చేస్తున్నారా? అయితే వీళ్లకు చిక్కితే అంతే సంగతులు..
- Running Train: రన్నింగ్ ట్రైన్ నుంచి కాలువలోకి దూకేసిన మహిళ.. ఆ తర్వాత ఏం జరిగిందంటే?
- సెక్యూరిటీ గార్డు డాక్టర్ అయ్యాడు! ఏకంగా రోగికి కట్టుకట్టి ఇంజెక్షన్ కూడా ఇచ్చాడు!