ఎస్.కోట ఎమ్మెల్యే కడుబండి శ్రీనివాసరావు.
వేపాడ,మార్చి,30(ఆంధ్ర పత్రిక ):- శ్రీరామనవమిని పురష్కరించుకొని ప్రజలందరికి శ్రీసీతారాముల ఆశీస్సులు అందాలని ప్రార్థిస్తున్నానని ఎస్. కోట ఎమ్మెల్యే కడుబండి శ్రీనివాసరావు అన్నారు. ముందుగా ఆయనతో పాటు ఎమ్మెల్సీ రఘురాజు తదితరులు గురువారం మండలంలోని సోంపురంలో శ్రీసీతారాములు వారి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు.అనంతరం ఎమ్మెల్యే కడుబండి అన్నసమారాధనలో పాల్గొని భక్తులకు అన్నప్రసాదలను వడ్డీంచారు.ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ పవిత్రమైన శ్రీరామనవమి సందర్బంగా కళ్యాణం తిలకించడం అన్న ప్రసా దాలను స్వీకరించడం వల్ల పుణ్యం దక్కి పునర్జన్మ ప్రాప్తిస్తుందన్నారు.అనంతరం ఆయన గ్రామ సర్పంచ్ మురిపిండి గంగరాజు, ఎంపీటీసీ సభ్యులు ఆకుల సత్యనారాయణ,టీ.వీ రమణ,వైసీపీ మండల యువజన విభాగం అధ్యక్షులు ఉగ్గిన శ్రీనివాసరావు తదితరులుతో స్వామివారి అన్నప్రసాదాలను స్వీకరించారు.
Trending
- ఆక్స్ఫర్డ్ భవానిపురం స్కూల్లో బాలల దినోత్సవం వేడుకలు అంగరంగ వైభవంగా నిర్వహించారు.
- ఆక్స్ఫర్డ్ స్కూల్‌లో ఘనంగా బాలల దినోత్సవం
- AP TET 2024 Results: మరికాసేపట్లో టెట్ ఫలితాలు వచ్చేస్తున్నాయ్..
- AP Mega DSC Notification: మరో 2 రోజుల్లోనే మెగా డీఎస్సీ నోటిఫికేషన్ వచ్చేస్తోంది.. జిల్లాల వారీ ఖాళీలు ఇవే!
- Tirumala: నాగుల చవితి సందర్భంగా రేపు పెద్ద శేష వాహనం సేవ.. దేవేరులతో కలిసి శ్రీవారు భక్తులకు దర్శనం..
- AP News: ట్రెండింగ్ చేస్తున్నారా? అయితే వీళ్లకు చిక్కితే అంతే సంగతులు..
- Running Train: రన్నింగ్ ట్రైన్ నుంచి కాలువలోకి దూకేసిన మహిళ.. ఆ తర్వాత ఏం జరిగిందంటే?
- సెక్యూరిటీ గార్డు డాక్టర్ అయ్యాడు! ఏకంగా రోగికి కట్టుకట్టి ఇంజెక్షన్ కూడా ఇచ్చాడు!