అక్టోబర్ 31 (ఆంధ్రపత్రిక): అల్లు శిరీష్ హీరోగా నిలదొక్కుకోవడానికి భారీ ప్రయత్నాలే చేస్తున్నాడు. కెరీర్ బిగెనింగ్ నుండి విభిన్న సినిమాలు చేస్తున్నా.. అల్లు శిరీష్‌కు కమర్షియల్ హిట్టు మాత్రం రావడంలేదు. ప్రస్తుతం శిరీష్ ఆశలన్ని ’ఊర్వసివో రాక్షసివో’ సినిమాపైనే ఉన్నాయి. ఇప్పటికే చిత్రం నుండి రిలీజైన పోస్టర్లు, టీజర్లకు ప్రేక్షకుల నుండి విశేష స్పందన వచ్చింది. రాకేశ్ శశి దర్శకత్వం వహించిన ఈ చిత్రం గతేడాదే షూటింగ్ పూర్తి చేసుకుంది. కానీ పలు కారణాల వల్ల రిలీజ్ వాయిదా పడుతూ వచ్చింది. ఇక ఇటీవలే ఈ చిత్రాన్ని నవంబర్ 4న విడుదల చేస్తున్నట్లు మేకర్స్ ప్రకటించారు. రిలీజ్ డేట్ దగ్గర పడుతుండటంతో చిత్రబృందం వరుస అప్డేట్లను ప్రకటిస్తూ సినిమాపై విపరీతమైన క్యూరియాసిటీ క్రియేట్ చేస్తున్నారు. తాజాగా చిత్ర యూనిట్ ఈ సినిమా ట్రైలర్‌ను విడుదల చేశారు. తాజాగా రిలీజైన ట్రైలర్ ఆద్యంతం అకట్టుకుంటుంది. ’తను కొరియన్ వెబ్ సిరీస్‌లా ట్రెండీగా ఉంటే.. నువ్వేంట్రా కార్తికదీపం సీరియల్లో డాక్టర్ బాబు, వంటలక్కలాగా పేజీలు పేజీలు డైలాగ్స్ చెబుతున్నావ్’ అంటూ వెన్నెల కిషోర్ డైలాగ్స్ అలరిస్తున్నాయి. ట్రైలర్ మొత్తం ఫన్‌తో పాటు ఎంటర్టైనింగ్ ఉంది. ’నేనిక్కడ నానా పటేకర్ రేంజ్లో పర్ఫామెన్స్ చేస్తుంటే.. నువ్వు కనీసం ఈటీవి ప్రభాకర్‌లా క్యాచ్ చేయలేక పోతున్నావ్’ అంటూ సునీల్ చెప్పే డైలాగ్స్ నవ్వులూ పూయిస్తున్నాయి. ట్రైలర్‌తో సినిమాపై మరింత అంచనాలు పెరిగాయి. రొమాంటిక్ ఎంటర్టైనర్గా తెరకెక్కిన ఈ చిత్రాన్ని జీఏ`2 పిక్చర్స్, శ్రీ తిరుమల ప్రొడక్షన్స్ సంయుక్తంగా నిర్మించాయి. శిరీష్‌కు జోడీగా అను ఇమ్మాన్యూయెల్ హీరోయిన్గా నటించింది. అనూప్‌రూబెన్స్, అచ్చు రాజమణి బాణీలు అందించారు.
Trending
- ఆక్స్ఫర్డ్ భవానిపురం స్కూల్లో బాలల దినోత్సవం వేడుకలు అంగరంగ వైభవంగా నిర్వహించారు.
- ఆక్స్ఫర్డ్ స్కూల్లో ఘనంగా బాలల దినోత్సవం
- AP TET 2024 Results: మరికాసేపట్లో టెట్ ఫలితాలు వచ్చేస్తున్నాయ్..
- AP Mega DSC Notification: మరో 2 రోజుల్లోనే మెగా డీఎస్సీ నోటిఫికేషన్ వచ్చేస్తోంది.. జిల్లాల వారీ ఖాళీలు ఇవే!
- Tirumala: నాగుల చవితి సందర్భంగా రేపు పెద్ద శేష వాహనం సేవ.. దేవేరులతో కలిసి శ్రీవారు భక్తులకు దర్శనం..
- AP News: ట్రెండింగ్ చేస్తున్నారా? అయితే వీళ్లకు చిక్కితే అంతే సంగతులు..
- Running Train: రన్నింగ్ ట్రైన్ నుంచి కాలువలోకి దూకేసిన మహిళ.. ఆ తర్వాత ఏం జరిగిందంటే?
- సెక్యూరిటీ గార్డు డాక్టర్ అయ్యాడు! ఏకంగా రోగికి కట్టుకట్టి ఇంజెక్షన్ కూడా ఇచ్చాడు!