-
సిఆర్డిఎ చట్టం మేరకు నడుచుకోవాలి
-
ప్రభుత్వానికి హైకోర్టు ఆదేశాలు
- హైకోర్టు తీర్పుపై సుప్రీంలో సర్కార్ సవాల్
అమరావతి,సెప్టెంబర్ 17 (ఆంధ్రపత్రిక): సీఆర్డీయే చట్టం ప్రకారమే రాష్ట్ర ప్రభుత్వ వ్యవహరించాలని, నెల రోజుల్లో అమరావతిలో అన్ని సదుపాయాలను కల్పించాలని ఎపి హై కోర్టు వైసిపి ప్రభుత్వాన్ని ఆదేశించింది. హైకోర్టు ఇచ్చిన తీర్పును ఎపి ప్రభుత్వం సుప్రీంకోర్టులో సవాల్ చేసింది. హైకోర్టు ఇచ్చిన తీర్పుపై స్టే ఇవ్వాలని తన పిటిషన్‌లో కోరింది. హైకోర్టు ఇచ్చిన తీర్పును అమలు చేయడం సాధ్యం కాదని పిటిషన్‌లో తెలిపింది. రాజధానిపై చట్టాలు చేసే అధికారం శాసనసభకు లేదని చెప్పడం శాసనసభను అగౌరవపరచడమేనని చెప్పింది. ఈ క్రమంలో మూడు రాజధానులపై ఏపీ ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించింది. అమరావతే రాజధాని అంటూ హైకోర్టు ఇచ్చిన తీర్పును.. సుప్రీంకోర్టులో ఏపీ సర్కార్ సవాల్ చేసింది. రాజధానిపై చట్టాలు చేసే అధికారం అసెంబ్లీకి లేదని హైకోర్టు తీర్పును వెలువరించింది. అలా చేయడమంటే శాసన వ్యవస్థను నిర్వీర్యం చేయడమేనని ఏపీ సర్కార్ పేర్కొంది. హైకోర్టు తీర్పుపై వెంటనే స్టే ఇవ్వాలని ఏపీ ప్రభుత్వం కోరింది. సీఆర్డీఏ చట్టం ప్రకారమే రాష్ట్ర ప్రభుత్వం వ్యవహరించాలంటూ.. హైకోర్టు సూచించడం అసెంబ్లీ అధికారాలను ప్రశ్నించడమేనని సర్కార్ పేర్కొంది. అభివృద్ధి వికేంద్రీకరణ కోసమే మూడు రాజధానులని పిటిషన్‌లో ప్రభుత్వం వెల్లడిరచింది. హైకోర్టు తీర్పును అమలు చేయడం సాధ్యం కాదని ఏపీ సర్కార్ తెలిపింది.