ఏపీ ప్రభుత్వం దసరా సెలవుల్లో మార్పులు చేసింది. అధికారికంగా సెలవుల పైన స్పష్టత ఇచ్చింది. ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసింది. 3వ తేదీ నుంచి 13వ తేదీ వరకు స్కూళ్లకు దసరా సెలవులు ప్రకటిస్తూ నిర్ణయం తీసుకుంది.
ఉపాధ్యాయులు, పలు సంఘాల విజ్ఞప్తితో ఒకరోజు ముందుగానే సెలవులు ఇస్తున్నామని ప్రభుత్వం వెల్లడించింది.
ఆంధ్రప్రదేశ్లో దసరా సెలవులపై స్పష్టత వచ్చింది. ఏపీ ప్రభుత్వం విడుదల చేసిన క్యాలెండర్ ప్రకారం అక్టోబర్ 3 నుంచి 13 వరకూ 11 రోజుల సెలవులుంటాయి. రాష్ట్రంలోని అన్ని విద్యా సంస్థలకు ఇవే రోజుల్లో సెలవులు అమలు కానున్నాయి. ఈ మేరకు ప్రభుత్వం ఉత్తర్వుల్లో స్పష్టం చేసింది. గతంలో ప్రకటించిన సెలవుల క్యాలెండర్ తరువాత ఉపాధ్యాయులు, పేరెంట్స్ నుంచి వచ్చిన అభ్యర్ధనలతో ప్రభుత్వం తాజా నిర్ణయం తీసుకుంది. అన్ని జిల్లా విద్యా శాఖ అధికారులకు ఈ మేరకు అదేశాలు ఇచ్చింది.
అదే విధంగా.. క్రిస్మస్ సెలవులు డిసెంబర్ 22 నుంచి 29 వరకు ఉంటాయి. ఇక సంక్రాంతి సెలవులు ఏపీలో వచ్చే ఏడాది జనవరి 10 నుంచి 19 వరకు ఉంటాయి. అంటే ఏపీలో దసరాకు 11 రోజులు, సంక్రాంతికి 9 రోజుల సెలవులు ఉండనున్నాయి. గతంలో విద్యా సంవత్సరంలో ప్రకటించిన క్యాలెండర్ అమలు చేస్తూనే..దసరా సెలవుల విషయంలో ప్రభుత్వం తాజా నిర్ణయం తీసుకుంది. దీంతో..తిరిగి పాఠశాలలు అక్టోబర్ 14న ప్రారంభం కానున్నాయి.